in

Rashmika and thamanna to perform at IPL opening ceremony?

నెల 31 నుంచి ఐపీఎల్ మొద‌లు కాబోతోంది. దాదాపు నెల‌న్న‌ర పాటు క్రికెట్ ప్రేమికుల‌కు పండ‌గే. అహ్మ‌దాబాద్ వేదిక‌గా గుజ‌రాత్‌,చెన్నై మ‌ధ్య జ‌రిగే మ్యాచ్‌తో ఈ టోర్నీకి క్లాప్ కొట్ట‌బోతున్నారు. ప్రారంభోత్స‌వ వేడుక‌ని అట్ట‌హాసంగా చేయాల‌న్న‌ది ఐపీఎల్ నిర్వాహ‌కుల ప్లాన్‌. అందుకోసం బాలీవుడ్, టాలీవుడ్ స్టార్స్‌ని రంగంలోకి దింపుతున్నారు. 31న అహ్మ‌దాబాద్ లో జ‌రిగే ఈవెంట్ లో ర‌ష్మిక‌, త‌మ‌న్నా..నృత్య ప్ర‌ద‌ర్శ‌న చేయ‌బోతున్నార్ట‌. వీరిద్ద‌రూ..స్టేజీపై టాలీవుడ్ హిట్ పాట‌ల‌కు డాన్స్ చేస్తార‌ని స‌మాచారం.

అందుకోసం ర‌ష్మిక ఇప్ప‌టికే రిహార్స‌ల్స్ మొద‌లెట్టేసింద‌ని స‌మాచారం. ఈ ఈవెంట్ లో పాల్గొన‌డానికీ, స్టేజీ పెర్‌ఫార్మ్సెన్స్ చేయ‌డానికి ఈ క‌థానాయిక‌లిద్ద‌రూ భారీ మొత్తంలో పారితోషికం అందుకోబోతున్నార‌ని టాక్‌. ఈసారి ఐపీఎల్ లో తెలుగు ప్రేక్ష‌కుల్ని మ‌రింత ఆక‌ట్టుకోవ‌డానికి.. బాల‌కృష్ణ‌ని రంగంలోకి దింపాల‌ని ఐపీఎల్ మేనేజ్ మెంట్ భావిస్తోంది. బాల‌య్య‌.. కొన్ని మ్యాచ్‌ల‌కు కామెంట్రేట‌ర్ గా వ్య‌వ‌హ‌రించే అవ‌కాశం ఉంది. వెంక‌టేష్ సైతం.. ఈ ఐపీఎల్ లో ప్ర‌త్యేక ఆకర్ష‌ణ‌గా నిల‌వ‌బోతున్నార‌ని స‌మాచారం..!!

dhamaka girl sreeleela reveals about her favorite hero!

Netizen asks Samantha Ruth Prabhu to ‘date someone’!