
గతంలో ప్రతి సినిమాకు సుమారు రూ. 20 కోట్లు పారితోషికం తీసుకునే ఈ స్టార్ హీరో, ఇప్పుడు ఏకంగా రూ. 35 కోట్లు నుంచి రూ. 40 కోట్ల వరకు డిమాండ్ చేస్తున్నట్లు తెలుస్తోంది. సినిమా ఫలితాలు, ఆయన క్రేజ్‌ను దృష్టిలో ఉంచుకొని మేకర్స్ కూడా ఈ మొత్తాన్ని ఇవ్వడానికి వెనుకాడటం లేదని సమాచారం. కేవలం పారితోషికం మాత్రమే కాకుండా లాభాల్లో వాటా తీసుకునే పద్ధతికి కూడా ఆయన ప్రాధాన్యత ఇస్తున్నట్లు తెలుస్తోంది. ఈ పరిణామం టాలీవుడ్ నిర్మాణ రంగంలో ప్రస్తుతం హాట్ టాపిక్‌గా మారింది.
తాజాగా విడుదలైన ఇరుముడి చిత్రానికి సంబంధించి రవితేజ ఆర్థికంగా భారీ లాభాలను ఆర్జించినట్లు ట్రేడ్ సర్కిల్స్ వెల్లడిస్తున్నాయి. ఈ సినిమా కోసం ఆయన రూ. 7 కోట్లు రెమ్యునరేషన్ తీసుకున్నప్పటికీ, ఒప్పందంలో భాగంగా నైజాం కలెక్షన్లలో వాటా కూడా దక్కింది. ఈ వాటాతో కలిపి ఆయన ఈ ఒక్క సినిమా ద్వారా మొత్తం రూ. 50 కోట్లు వరకు సంపాదించినట్లు సమాచారం. ఒక స్టార్ హీరో ఈ స్థాయిలో లాభాలు అందుకోవడం టాలీవుడ్ చరిత్రలో అరుదైన విషయమని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. సినిమా పరిశ్రమలో ఇతరులకు ఆదర్శంగా నిలుస్తున్న రవితేజ బాక్సాఫీస్ రికార్డులను తిరగరాస్తున్నారు. అభిమానులు ఈ అప్‌డేట్ పట్ల ఎంతో ఆనందం వ్యక్తం చేస్తూ సోషల్ మీడియాలో ట్రెండ్ చేస్తున్నారు..!!
