బిగ్ బాస్ కార్యక్రమంతో తెలుగు ప్రేక్షకులకు దగ్గరైన హారిక ఇటీవల తెలంగాణ టూరిజం బ్రాండ్ అంబాసిడర్‌గా ఎంపికైన సంగతి తెలిసిందే. అంతర్జాతీయ మహిళా దినోత్సవం రోజున హారికకు ఈ పదవి కట్టబెట్టగా, దీనిపై పెద్ద వివాదమే చెలరేగింది. తెలంగాణ ఎక్సైజ్, టూరిజం శాఖ మంత్రి శ్రీనివాస్ గౌడ్.. హారికకు ఎలా ఈ పదవి ఇస్తారు, ఆమె ఎవరో కూడా నాకు తెలియదంటూ కామెంట్స్ చేశారు. అనంతరం అనేక నాటకీయ పరిణామాలు జరగగా,
తాను తెలంగాణ రాష్ట్ర పర్యాటక అభివృద్ధి సంస్థ బ్రాండ్ అంబాసిడర్ పదవి నుంచి తాను తప్పుకుంటున్నట్టు ప్రకటించింది. సోషల్ మీడియాలో వీడియో విడుదల చేసిన హారిక .. ‘‘అందరికీ నమస్తే. ఒక చిన్న క్విక్ అప్డేట్.. మహిళా దినోత్సవం రోజు నన్ను టీఎస్‌టీడీసీకి బ్రాండ్ అంబాసిడర్‌గా ఎంపిక చేయడం దగ్గర నుంచీ ఏం జరిగిందో మీ అందరికీ తెలిసిందే.. అనివార్య కారణాల వలన పదవి నుండి తప్పుకుంటున్నాను. ఎవరినైన నొప్పించి ఉంటే క్షమించండి. నాక సపోర్ట్‌గా ఉన్న వారందరికి ప్రత్యేక ధన్యవాదలు. లవ్ యూ ఆల్ అంటూ పేర్కొంది.