
ప్రముఖ నటి అనుపమ పరమేశ్వరన్ సోషల్ మీడియాలో ఒక ఆసక్తికరమైన, భావోద్వేగ పోస్ట్ చేశారు. తనకు శాంతి దొరికిందని, ఇకపై ఎలాంటి అనుమతులు తీసుకోవాల్సిన అవసరం లేదని, భయపడాల్సిన పనిలేదని స్పష్టం చేశారు. “నా గొంతుకను నేనే ఎంచుకుంటా” అంటూ ఆమె చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు చర్చనీయాంశమయ్యాయి.
ఇన్స్టాగ్రామ్లో ఆమె రాస్తూ, “కొన్నిసార్లు శాంతిని కనుగొనడానికి కొన్నింటిని వదిలేయాల్సి ఉంటుంది. ఈ రోజు నాకు ఆ శాంతి దొరికింది. ఈ రోజు నుంచి నా గొంతుకను, నా జీవితాన్ని నేనే ఎంచుకుంటాను. ఇకపై అనుమతులు లేవు, భయాలు లేవు. నన్ను నేను వెతుక్కుంటూ నా జీవితాన్ని ప్రేమిస్తున్నాను” అని పేర్కొన్నారు. చాలా కాలంగా చెప్పాలనుకున్న విషయాన్ని ఇప్పుడు చెబుతున్నానని, ఇంతకాలం దాన్ని చెప్పేందుకు తనను అనుమతించలేదని ఆమె అన్నారు. అభిమానులందరికీ “ఐ లవ్యూ” చెప్పారు..!!

