in

Kajal Aggarwal motherhood script selection changes

లభై ఏళ్ల వయసులో అడుగుపెట్టి, నాలుగేళ్ల కుమారుడు నీల్‌కు తల్లిగా బాధ్యతలు నిర్వర్తిస్తున్న తరుణంలో తన ఆలోచనా విధానంలో మార్పులు వచ్చాయని కాజల్ ఇటీవల ఒక ఇంటర్వ్యూలో పేర్కొన్నారు. “ప్రస్తుతం ఏదైనా కథ వింటున్నప్పుడు ఒక తల్లిగా ఆలోచిస్తున్నాను. భవిష్యత్తులో నా కుమారుడు ‘ఇది మా అమ్మ సినిమా’ అని గర్వంగా చెప్పుకునేలా ఉండాలని కోరుకుంటున్నాను” అని ఆమె తెలిపారు. కెరీర్ తొలినాళ్లలో శరీరాకృతి, పాత్రల విషయంలో ఒత్తిళ్లకు తలొగ్గినప్పటికీ, ఇప్పుడు అలాంటి వాటికి ఆస్కారం ఇవ్వనని స్పష్టం చేశారు..

ప్రస్తుతం తాను నటిస్తున్న బాలీవుడ్ చిత్రం ‘ది ఇండియన్ స్టోరీ’లో న్యాయవాది అర్చన పాత్రను పోషిస్తున్నట్లు కాజల్ వివరించారు. తన శారీరక, మానసిక దృఢత్వానికి నిత్యం చేసే యోగా, వారానికి రెండుసార్లు చేసే వెయిట్ ట్రైనింగ్ మరియు శాకాహారమే ప్రధాన కారణమని ఆమె పేర్కొన్నారు. ఆరోగ్యమే అత్యంత ముఖ్యమని, మిగతావన్నీ ఆ తర్వాతేనని ఆమె హితవు పలికారు. సోషల్ మీడియాను ‘బ్రెయిన్ పాయిజనింగ్’ తో పోల్చిన కాజల్.. మానసిక ప్రశాంతత కోసం దానికి సాధ్యమైనంత దూరంగా ఉండటమే శ్రేయస్కరమని సూచించారు..!!

Anupama Parameswaran: No more permissions, no more fear!

young beauty Siri Hanumanth grabs allu arjun’s raaka offer!