in

another nickname of mahanati savitri!

తెలుగు చలనచిత్ర పరిశ్రమలో మహానటి అన్న పేరు వినపడగానే అందరికీ టక్కున గుర్తొచ్చేది సావిత్రి గారు. తన అందంతో తన నటనతో తన వాక్చాతుర్యంతో తన టాలెంట్ తో సినిమా ఇండస్ట్రీలో మకుటం లేని మహారాణిగా ఎదిగింది. ఎవరికైనా సరే జీవితంలో ఒక బ్యాడ్ టైం అంటూ వస్తుంది . ఆ బ్యాడ్ టైం చక్కగా మేనేజ్ చేసిన వాళ్లే లైఫ్ లో సక్సెస్ఫుల్గా ముందుకెళ్తారు . కాదు కూడదు అని తప్పుడు నిర్ణయాలు తీసుకున్నారా..? ఇక అంతే ఆ దేవుడు కూడా కాపాడలేడు.

అలాంటి నిర్ణయం తీసుకొని తన లైఫ్ని తన చేతులతో నాశనం చేసేసుకునింది మహానటి సావిత్రి . అయితే ఇండస్ట్రీలో సావిత్రికి మంచి పేరు ఉంది అందరూ మహానటి అంటూ ముద్దుగా పిలుచుకుంటూ ఉంటారు. అయితే మహానటి కాకుండా సావిత్రి కి మరో ముద్దు పేరు కూడా ఉంది అదే మహాలక్ష్మి. సెట్స్ కి ఎప్పుడు వచ్చినా సరే చిరునవ్వుతో హ్యాపీగా చక్కగా చీర కట్టుకొని మహాలక్ష్మిలా అడుగుపెడుతుందట. అందుకే చాలామంది హీరోలు ఆమెను మహాలక్ష్మి లా ఉంది అంటూ అభివర్ణిస్తూ ఉంటారట..అంతేకాదు ఆమెకు మహాలక్ష్మి అన్న ముద్దు పేరు పెట్టింది కూడా తారక రామారావు గారే అంటూ అప్పట్లో జనాలు మాట్లాడుకునేవారు..!!

malayalam beauty Samyuktha Menon to Romance Balakrishna!

prabhas confirmed to play lord shiva in ‘kannappa’!