in

energetic star Ram Pothineni Turns Director With RAPO23!

ఎనర్జిటిక్ స్టార్ రామ్ పోతినేని మరో సాహసానికి సిద్ధమయ్యారు. ఇప్పటివరకు నటుడిగా అలరించిన ఆయన, తాజాగా ‘రాపో 23’ చిత్రంతో దర్శకుడిగా పరిచయమవుతున్నారు. అత్యంత ప్రతిష్టాత్మకమైన ఈ సైకలాజికల్ యాక్షన్ థ్రిల్లర్ షూటింగ్ హైదరాబాద్‌లో వైభవంగా ప్రారంభమైంది. రామ్ దర్శకత్వ ప్రతిభ, కథా నైపుణ్యం ఈ సినిమాను మరో స్థాయికి తీసుకెళ్తాయని అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు..

హైదరాబాద్‌లో నేడు జరిగిన ప్రత్యేక పూజా కార్యక్రమంతో ‘రాపో 23’ చిత్రం ఘనంగా ప్రారంభమైంది. ఈ చిత్రానికి రామ్ పోతినేని కథను అందించడమే కాకుండా, తొలిసారిగా మెగాఫోన్ పట్టి దర్శకత్వం వహిస్తున్నారు. ఈ సినిమా ఒక విభిన్నమైన సైకలాజికల్ యాక్షన్ థ్రిల్లర్ అని, నియో-నోయిర్ శైలిలో సాగుతుందని చిత్ర బృందం వెల్లడించింది. ముహూర్తపు సన్నివేశానికి సీనియర్ నటుడు మురళీమోహన్ కెమెరా స్విచ్ ఆన్ చేయగా, నిర్మాత కృష్ణ పోతినేని రామ్ కు స్క్రిప్ట్ అందజేశారు..!!

kayadu lohar in suriya and jai bhim’s director next!

trisha to contest in by-elections from vijay’s tvk party?