in

SOUTH INDIAN HEROINE WHO IMPRESSED NEHRU!

భారత దేశ మొట్ట మొదటి ప్రధాని అయిన జవహర్ లాల్ నెహ్రు ని సమ్మోహితుడిని చేసిన సౌత్ ఇండియన్ హెరాయిన్ ఎవరో తెలుసా? 1963 ఢిల్లీలో ఇంటర్నేషనల్ ఫిలిం ఫెస్టివల్ జరుగుతుంది, దాదాపు 100 దేశాల నుంచి చిత్ర ప్రముఖులు హాజరు అయ్యారు. అప్పటి ప్రధాని మంత్రి చీఫ్ గెస్ట్ గ హాజరు అయ్యారు, స్టేజి మీద నెహ్రు గారు బహుమతులు అందిస్తున్నారు, ఇంతలో స్టేజి మీద ఒక మెరుపు మెరిసింది, ఆమెకు బహుమతి ఇస్తున్న నెహ్రు గారు ఒక్క క్షణం తడబడ్డారు, ఆమె అందం అటువంటిది మరి, ఆమెకు బహుమతిని ఇస్తూ “తుమ్ బహుత్ చమక్ రహిహో” అంటూ ఆమెకు కితాబు ఇచ్చారు, ఆమె సిగ్గుల మొగ్గే అయింది. అప్పటికే ఆమెకు” క్లియోపాత్రా అఫ్ సౌత్ ” అనే బిరుదు ఇచ్చియున్నారు ప్రేక్షకులు.

సౌత్ ఫిలిం ఇండస్ట్రీ లో దాదాపు అందరు పెద్ద హీరోల సరసన నటించటమే కాకుండా, హిందీలో దిలీప్ కుమార్ వంటి దిగ్గజాలతో నటించిన ఘనత ఆమెది. ఆమె ఎవరో కాదు కన్నడ నాట జన్మించి, సినీ రంగ ప్రవేశం చేసి సౌత్ ఇండియన్ లాంగ్వేజెస్ అన్నింటిలో ప్రముఖ హీరోయిన్ గ వెలుగొందటమే కాక అత్యధిక పారితోషికం తీసుకున్న బి.సరోజ దేవి, ఇప్పుడు ఒప్పుకుంటారా నెహ్రు అంతగా సమ్మోహితులు అవటం లో తప్పు లేదని. మూడు దశాబ్దాల పాటు సౌత్ ఇండియన్ ఫిలిం ఇండస్ట్రీ లో తిరుగులేని హీరోయిన్ గ వెలుగొందారు బి.సరోజ దేవి.ప్రస్తుతం బెంగళూరులో విశ్రాంత జీవితం గడుపుతున్నారు క్లియోపాత్రా అఫ్ సౌత్, అయిన బి.సరోజ దేవి..!!

Bhagavanth Kesari will be the last for kajal in telugu?

Krithi Shetty In Sushmita Konidela’s Female-Centric Film?