in

YAMUDIKI HANDICHHINA AATREYA!

మ ధర్మ రాజుకి హ్యాండిచ్చిన ఆత్రేయ, సినీ పరిశ్రమలో” రాసి ప్రేక్షకులను, రాయక నిర్మాతలను ఏడిపిస్తాడు” ఆత్రేయ అనే నానుడి ఉండేది. అదే అలవాటుగా యమధర్మ రాజుని కూడా, టైం కి వెళ్లక ఏడిపించారట ఆత్రేయ గారు. ఒక రోజు ఒక ప్రముఖ జ్యోతిష్యుడు ఆత్రేయ గారి హస్త రేఖలు చూసి, మీకు మృత్యువు ముంచుకొస్తుంది, మీరు ఫలానా రోజు, ఫలానా టైం కి చనిపోతారు అని డిక్లేర్ చేసేసాడట. ఆత్రేయ గారు ఆ విషయాన్ని తన డైరీ లో నోట్ చేసుకొని పెట్టుకున్నారట. ఇది జరిగిన కొన్ని రోజులకు డైరెక్టర్ సింగీతం శ్రీనివాస రావు తాను తీయబోయే చిత్రానికి పాటలు రాయమని అడగటానికి ఆత్రేయ వద్దకు వచ్చారట.

ఇంకెన్ని రోజులు ఉంటానండి బాబు, నన్నెందుకు పిలుస్తారు, త్వరలో నేను చావబోతున్నాను అంటూ, తన డెత్ డేట్ మిస్టరీ గురించి చెప్పారు. అది వినిన సింగీతం గారు, మీకు డేట్, టైం వర్తించవు, చెప్పిన టైం కి రావటం, రాయటం మీ జాతకం లో లేదు, కాబట్టి ఆ జ్యోతిష్యుడు చెప్పిన డేట్ కి మీరు చచ్చిన చావరు, ఫరవా లేదు రండి, అని లాక్కెళ్ళారట. ఆ తరువాత ఆత్రేయ గారు , చాలా డైరీలు మార్చారు, చాల కాలం పాటలు రాసారు, మరి అది ఆత్రేయ గారు అంటే, అలా యముడికి కూడా హ్యాండిచ్చి వేళ్ళ వలసిన టైం కి వెళ్లకుండా యముడిని కూడా ముప్పా తిప్పలు పెట్టిన వైనం!!!

Kriti Sanon Calls Out Nepotism: 'Outsiders Get Written Off"

Kriti Sanon Calls Out Nepotism:Outsiders Get Written Off

Naveen Polishetty to work with tamil director next!