తాను నమ్మిన,తనను నమ్మిన వాళ్ళకి ప్రభాస్ ఎంత విలువ ఇస్తాడో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు.కేవలం తనను నమ్ముకొని “రన్ రాజా రన్” లాంటి సూపర్ హిట్ తర్వాత మరో సినిమా చేయకుండా వెయిట్ చేశాడన్న ఒకే ఒక్క కారణం తో సుజీత్ కు సాహో సినిమా ను ఇచ్చాడు.అయితే బాలీవుడ్ లో మంచి వసూళ్ళు సాధించినప్పటికీ తెలుగు లో డిస్ట్రిబ్యూటర్ లు ఢీలా పడ్డారు.
ఇది తెలిసిన ప్రభాస్ సుజీత్ కు మరో అవకాశం ఇవ్వాలని చూస్తున్నట్టు సమాచారం.ప్రస్తుతానికి రాధాకృష్ణ దర్శకత్వంలో జూన్ అనే చిత్రానికి సైన్ చేశాడ ప్రభాస్.ఈ ప్రాజెక్టు పూర్తి అవ్వగానే సుజీత్ సుజీత్ కు మరో అవకాశం ఇవ్వాలని ఆలోచిస్తున్నాడట. అన్నీ కుదిరితే.. మళ్ళీ యువీ క్రియేషన్స్ ఈ ప్రొజెక్ట్ ను నిర్మించవచ్చు.మరి సుజీత్ అదృష్టం ఎలా ఉందో తెలియడానికి ఇంకొన్ని రోజులు వేచి చూడాల్సిందే….