కౌసల్యాకృష్ణమూర్తి సినిమాతో తెలుగులోకి అరంగేట్రం చేసిన సోగసరి ఐశ్వర్యా రాజేష్. ఈ ముద్దుగుమ్మ చెన్నై అందాల సోయగం. తన సినిమాలతో అందరినీ ఆకట్టుకుంటుంది. లేడీ ఓరియాంటెడ్ సినిమాలంటే దర్శకనిర్మాతలను టక్కు ఐశ్వర్యా రాజేష్ గుర్తొస్తోంది. అయితే ఈ పుత్తడిబొమ్మ తన నూతన చిత్రాన్ని ప్రకటించింది. ఈ సినిమాకి డ్రైవర్ జమునా అనే పేరును ఖరారు చేశారు. ఇందులో కాబ్ డ్రైవర్గా ఐశ్వర్యా దర్శనం ఇవ్వనుంది.
ఈ మేరకు దీని సంబంధించి ఐశ్వర్యానే స్వయంగా తన సోషల్ మీడియా ద్వారా తెలిపింది. నా నూతన చిత్రం పేరు డ్రైవర్ జమునా.. స్పెషల్ డే సందర్భంగా ప్రకటిస్తున్నాని ఓ ఫోటోను కూడా షేర్ చేసింది. ఈ సినిమాకి పీ కిన్స్లివ్ దర్వకత్వం చేయనున్నాడు. ఐశ్వర్యా డ్రైవర్గా తొలిసారి చేస్తోంది. అయితే ప్రస్తుతం ఈ ముద్దుగుమ్మ నానీ సరసన టక్ జగదీష్ చేస్తోంది. తన నూతన చిత్రం ప్రకటించి అభిమానులను తనవైపు తిప్పుకుంది.