
కాయదు లోహర్ నటించిన ‘ది ప్యారడైజ్’ చిత్రం ద్వారా ఆమె ప్రస్తుతం సోషల్ మీడియాలో ప్రధాన చర్చనీయాంశంగా మారింది. ఈ చిత్రంలో ఆమె చాలా బోల్డ్ పాత్రను పోషించింది. ఒక సినిమా నటి కావాలనే ప్రయత్నం చేసే అమ్మాయిగా కనిపించింది కాయదు లోహర్. అక్కడ ఫెయిల్ అవ్వడం వల్ల..అవకాశాల కోసం బి-గ్రేడ్ సినిమాల్లో నటించే పాత్ర అది..
ఇక్కడ గ్లామరస్ గా కనిపించడంతో ఆమె పాత్రకు సంబంధించి కొన్ని సన్నివేశాలు సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అవుతున్నాయి. మరీ ముఖ్యంగా ఆమె గ్లామర్ లుక్, హీరో నానితో ఆన్-స్క్రీన్ కెమిస్ట్రీ, స్మోక్ చేసే సన్నివేశాలు యువతలో పెద్ద ఎత్తున చర్చకు దారితీశాయి. కాయదు లోహర్ పాత్ర విషయంలో ట్రోలింగ్ జరుగుతోంది. కానీ ఆమె గ్లామర్ తో ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుంది. ఓవైపు సినిమాకు నెగెటివ్ టాక్ వస్తున్నప్పటికీ, మరోవైపు కాయదు అందాలకు కుర్రాళ్లు ఫిదా అవుతున్నారు. బోల్డ్ వల్ల ఆమె దృష్టిలో పడింది. కానీ ఈ సినిమా వల్ల ఆమెకి ఏమైనా ఉపయోగం ఉంటుందా అనేది చూడాలి..!!

