in

Amala Paul Recalls Being Scared for Aadai Nude Scenes!

Keerthy Suresh’s Dorothy

దక్షిణాది సినిమాలలో హీరోయిన్లను అభ్యంతరకర రీతిలో చూపిస్తున్నారనే విమర్శలు వస్తున్న వివాదంపై అమలాపాల్ తన అభిప్రాయాన్ని పంచుకున్నారు. ఈ విషయంలో మొత్తం ఇండస్ట్రీని ఒకే జట్టు కట్టి బ్లేమ్ చేయవద్దని ఆమె అభిప్రాయపడ్డారు. ఏదైనా సినిమాలో హీరోయిన్ల పిక్చరైజేషన్ అనేది పూర్తిగా ఆయా సినిమా స్వభావం అలాగే డైరెక్టర్ ఆలోచనా విధానం మీద ఆధారపడి ఉంటుందని ఆమె వివరించారు. అందరినీ ఒకే కోణంలో చూడటం సరికాదని ఆమె స్పష్టం చేశారు..

ప్రస్తుత కాలంలో సినీ పరిశ్రమలో లేడీ ఓరియెంటెడ్ సినిమాలు క్రమంగా పెరుగుతుండటం శుభపరిణామమని అమలాపాల్ అన్నారు. మహిళా ప్రాధాన్యత ఉన్న కథలతో వస్తున్న చిత్రాలు ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకుంటున్నాయని ఆమె పేర్కొన్నారు. ఇదే సమయంలో తన గత చిత్రాల అనుభవాలను కూడా ఆమె గుర్తుచేసుకున్నారు. గతంలో ‘అడై’ సినిమాలో తాను నగ్నంగా నటించి పెద్ద రిస్క్ తీసుకున్నానని తెలిపారు. అయితే ఇప్పుడు మాత్రం అలాంటి సాహసోపేతమైన పాత్రలు తాను చేయకపోవచ్చునని ఆమె స్పష్టం చేశారు. వయసు అలాగే అనుభవం మారుతున్న కొద్దీ నటీనటుల ఆలోచనా విధానంలో కూడా మార్పులు వస్తాయని ఆమె అభిప్రాయపడ్డారు..!!

68 years for DONGA RAMUDU!

despite the mixed talk kayadu gets Recognition from ‘paradise’!