in

meenakshi chaudhary on board for nani’s Bloody Romeo?

Keerthy Suresh’s Dorothy

నేచురల్ స్టార్ నాని నటించిన భారీ యాక్షన్ డ్రామా ‘ది ప్యారడైజ్’ థియేటర్లలో సందడి చేస్తోంది. ఈ మూవీ విడుదలైన ఐదారు రోజులకే, దీని తర్వాత ఆయన చేయబోయే కొత్త సినిమా గురించి డిస్కషన్ స్టార్ట్ అయ్యింది. ఆ సినిమాలో హీరోయిన్ కూడా ఎంపిక అయ్యారని ఫిల్మ్ నగర్ వర్గాల టాక్. ఆ వివరాల్లోకి వెళితే..నాని నటించనున్న సినిమా ‘బ్లడీ రోమియో’. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ‘ఓజీ’తో భారీ కమర్షియల్ సక్సెస్ అందుకున్న సుజీత్, ఈ సినిమాకు దర్శకత్వం వహించనున్నారు. ‘ది ప్యారడైజ్’ విడుదల తర్వాత చిన్న విరామం తీసుకున్నారు నాని.

బ్రేక్ తర్వాత ‘బ్లడీ రోమియో’ చిత్రీకరణలో పాల్గొంటారు. భారీ బడ్జెట్‌తో స్టైలిష్ యాక్షన్ డ్రామాగా రూపొందనున్న ఈ సినిమాలో నాని సరసన హీరోయిన్‌గా మీనాక్షి చౌదరి  నటించనున్నట్లు ఫిల్మ్ నగర్ వర్గాల సమాచారం. ప్రస్తుతం ఆమెతో నిర్మాతలు చర్చలు జరుపుతున్నారట. ఈ కాంబినేషన్ సెట్ కావడం ఆల్మోస్ట్ ఫైనల్ అయినట్టే అని తెలిసింది. ఈ కాంబినేషన్‌కు సంబంధించిన విషయాన్ని త్వరలో అధికారిక ప్రకటన రానుంది. ఈ సినిమాలో నాని స్టైలిష్ లుక్‌లో కనిపిస్తారని టాక్. ఇందులో మలయాళ హీరో పృథ్వీరాజ్ సుకుమారన్ కీలకమైన పాత్రలో నటించనున్నారు..!!

despite the mixed talk kayadu gets Recognition from ‘paradise’!