in

Ram Charan’s Story Goes to Chiranjeevi-Trivikram!

Ram Charan’s Story Goes to Chiranjeevi-Trivikram!

Ram Charan's Story Goes to Chiranjeevi-Trivikram!

SOURCE —

Ram Charan’s Story Goes to Chiranjeevi-Trivikram!

As Posted on Website Telugu360

మెగాస్టార్ చిరంజీవి, మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ కాంబినేషన్‌లో ఓ సినిమా రాబోతుందనే వార్తలు గత కొంతకాలంగా టాలీవుడ్‌లో వినిపిస్తూనే ఉన్నాయి. అయితే ఇప్పటివరకు ఈ ప్రాజెక్ట్‌పై ఎలాంటి స్పష్టత రాకపోవడంతో అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. తాజాగా ఈ కాంబినేషన్‌కు సంబంధించి మరో ఆసక్తికరమైన వార్త ఫిల్మ్ నగర్ వర్గాల్లో చక్కర్లు కొడుతోంది. ఈసారి మాత్రం చిరంజీవి, త్రివిక్రమ్ కాంబినేషన్‌లో సినిమా పట్టాలెక్కడం దాదాపు ఖాయమనే ప్రచారం జరుగుతోంది. దీనికి సంబంధించి ఇద్దరి మధ్య ప్రాథమిక చర్చలు కూడా ప్రారంభమైనట్లు సమాచారం. చిరంజీవి సైతం త్రివిక్రమ్ దర్శకత్వంలో నటించేందుకు ఆసక్తి చూపిస్తున్నారని తెలుస్తోంది. నిజానికి త్రివిక్రమ్ తన తదుపరి ప్రాజెక్ట్‌ను యంగ్ టైగర్ ఎన్టీఆర్‌తో చేయాల్సి ఉంది..

‘ఆదర్శ కుటుంబం’ తర్వాత ఎన్టీఆర్‌తో ‘గాడ్ ఆఫ్ వార్’ అనే భారీ చిత్రాన్ని తెరకెక్కించేందుకు ఆయన ప్రణాళికలు సిద్ధం చేసుకున్నారు. అయితే కొన్ని కారణాల వల్ల ఈ ప్రాజెక్ట్ ఆలస్యమవుతున్నట్లు తెలుస్తోంది. దీంతో ఈలోపు మెగాస్టార్ చిరంజీవితో ఓ సినిమా పూర్తి చేయాలని త్రివిక్రమ్ భావిస్తున్నారట. ఈ చిత్రాన్ని ప్రముఖ నిర్మాత డీవీవీ దానయ్య నిర్మించే అవకాశాలు ఉన్నాయని ఇండస్ట్రీలో టాక్ వినిపిస్తోంది. ఇక ఈ ప్రాజెక్ట్ వెనుక మరో ఆసక్తికరమైన విషయం కూడా ప్రచారంలో ఉంది. రామ్ చరణ్‌ను దృష్టిలో పెట్టుకుని త్రివిక్రమ్ ఓ కథ సిద్ధం చేశారట. ఆ కథను చరణ్‌కు వినిపించడంతో పాటు చిరంజీవికి కూడా చెప్పినట్లు సమాచారం. అయితే చరణ్ సినిమాల విషయంలో తుది నిర్ణయం చిరంజీవిదే కావడంతో, ఆయన అభిప్రాయం తీసుకున్న తర్వాతే కథపై ముందుకు వెళ్లాలని భావిస్తున్నారట. ప్రస్తుతం అదే కథను చిరంజీవి హీరోగా తెరకెక్కించే ఆలోచనలో త్రివిక్రమ్ ఉన్నట్లు ప్రచారం జరుగుతోంది.

అయితే చరణ్‌కు సరిపోయే కథను చిరంజీవి ఇమేజ్‌కు అనుగుణంగా ఎలా మారుస్తారనేది ఆసక్తికరంగా మారింది. మరోవైపు త్రివిక్రమ్ సినిమాలంటే సాధారణంగా కుటుంబ భావోద్వేగాలు, వినోదం, చక్కటి సంభాషణలు ప్రధాన ఆకర్షణగా ఉంటాయి. ఈసారి కూడా ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌గానే సినిమాను రూపొందించే అవకాశం ఉందని తెలుస్తోంది. ‘గుంటూరు కారం’ ఆశించిన స్థాయిలో విజయం సాధించకపోవడం, ‘ఆదర్శ కుటుంబం’ ఫలితం కూడా పెద్దగా సంతృప్తినివ్వకపోవడంతో త్రివిక్రమ్‌కు ఇప్పుడు ఓ మంచి హిట్ అవసరమనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ఎన్టీఆర్‌తో ‘గాడ్ ఆఫ్ వార్’ వంటి భారీ ప్రాజెక్ట్‌ను ప్రారంభించే ముందు చిరంజీవితో ఓ విజయవంతమైన సినిమా అందుకోవాలని ఆయన భావిస్తున్నట్లు టాక్. మరి ఈ క్రేజీ కాంబినేషన్‌పై అధికారిక ప్రకటన ఎప్పుడు వస్తుందో, మెగాస్టార్ అభిమానులకు త్రివిక్రమ్ ఎలాంటి కథను అందిస్తారో చూడాలి..!!

ALSO READ — Keerthy Suresh Compares Bollywood And South Cinema Work Culture!

Sai Pallavi's Bold Short Hair Look for OM Movie!

Sai Pallavi’s Bold Short Hair Look for OM Movie!