
ప్రస్తుతం ఆమె త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ‘ఆదర్శ కుటుంబం’ చిత్రంలో కీలక పాత్ర పోషిస్తున్నారు. నివేదా తాజాగా తన గతాన్ని గుర్తుచేసుకుంటూ, 2023లో కొన్ని తప్పుడు నిర్ణయాలు, వ్యక్తిగత కారణాల వల్ల తీవ్రమైన డిప్రెషన్‌తో పాటు పానిక్ అటాక్స్‌ను ఎదుర్కొన్నానని వెల్లడించారు. ఆ పరిస్థితుల నుంచి బయటపడటానికి చాలా సమయం పట్టిందని, ఆ సమయంలోనే సినిమాలకు దూరమవ్వాలనే ఆలోచన వచ్చిందని చెప్పారు. అదృష్టవశాత్తూ పరిస్థితులు అనుకూలించి మళ్లీ అవకాశాలు రావడంతో నటనపై దృష్టి సారించినట్లు వివరించారు.
అంతేగాక కెరీర్ ఆరంభంలో తన రూపంపై అసంతృప్తితో పెదవులకు సర్జరీ చేయించుకోవాలని కూడా ఆలోచించినట్లు నివేదా తెలిపారు. ఈ విషయం గురించి తన వైద్యుడిని సంప్రదించగా, ఆయన తీవ్రంగా మందలించారని, భవిష్యత్తులో వచ్చే ఆరోగ్య సమస్యల గురించి హెచ్చరించడంతో ఆ ఆలోచనను విరమించుకున్నానని అన్నారు. “సహజ సౌందర్యంతోనే సాయి పల్లవి, నిత్యామీనన్ వంటి నటీమణులు ప్రేక్షకులను మెప్పిస్తున్నారు. వారిని చూశాక, నా రూపం గురించి నేను అనవసరంగా ఎందుకు ఆందోళన చెందుతున్నానో అర్థమైంది” అని నివేదా పేర్కొన్నారు..!!

