టాలీవుడ్ కు చెందిన ఈతరం దర్శకుల్లో పూరి జగన్నాధ్ కి ప్రత్యేకమైన శైలి ఉంటుంది అనడంలో సందేహం లేదు. ఆయన సినిమాల మేకింగ్ విషయంలో చాలా ఫాస్ట్‌గా ఉంటుంది. ఆయనతోటి దర్శకుల్లో ఏ ఒక్కరు కూడా పాతిక సినిమాలు కూడా చేయలేక పోయారు, భవిష్యత్తులో చేస్తారో లేదో కూడా తెలియదు. కాని ఇప్పటికే ఆయన 34 సినిమాలను ప్రేక్షకుల ముందుకు తీసుకు వచ్చాడు. ఒకానొక సమయంలో ఏడాదికి రెండు మూడు సినిమాలు విడుదల చేసిన పూరి జగన్నాద్ గత రెండేళ్లుగా కాస్త స్పీడ్ తగ్గించాడు. ఇస్మార్ట్ శంకర్ సక్సెస్ తో మళ్లీ జోరు పెంచాడు..
పూరి ఇప్పటి వరకు తెలుగులోనే కాకుండా హిందీ మరియు కన్నడ భాషల్లో కూడా సినిమాలను తెరకెక్కించాడు. ఆయన ముందు ముందు మరిన్ని హిందీ సినిమాలను కూడా చేసే అవకాశం ఉంది. ఆయన సినిమాల కోసం ప్రేక్షకులు ఎదురు చూస్తున్నారు. నిర్మాత దర్శకుడిగా ఎన్నో ఒడిదొడుకులు ఎదుర్కొన్న పూరి జగన్నాద్ తెలుగు ప్రేక్షకులకు ఎప్పటికి మర్చి పోలేని సినిమాలను అందించారు. ఆయన దర్శకత్వంలో ముందు ముందు కూడా మరిన్ని ఇస్మార్ట్ మూవీస్ రావాలని ఆయన అభిమానులు ఆశిస్తున్నారు. నేడు ఆయన పుట్టిన రోజు. ఈ సందర్బంగా ఆయనకు మా మీ తరపున హృదయ పూర్వక పుట్టిన రోజు శుభాకాంక్షలు తెలిజేస్తున్నాం..!!