in

Megastar Chiranjeevi Reacts to his blood bank allegations!

న సినీ ప్రస్థానంలో 48 ఏళ్లు పూర్తి చేసుకున్న సందర్భాన్ని పురస్కరించుకుని ఏర్పాటు చేసిన ‘మెగా యూత్ ఫోర్స్ ఫ్యాన్స్ మీట్’లో మెగాస్టార్ చిరంజీవి పాల్గొని మాట్లాడారు. ఈ సందర్భంగా, తనపై, చిరంజీవి బ్లడ్ బ్యాంక్‌పై గత కొంతకాలంగా ఉద్దేశపూర్వకంగా జరుగుతున్న దుష్ప్రచారాలు, నిందలపై ఆయన అత్యంత తీవ్రస్థాయిలో స్పందించారు. దశాబ్దాలుగా ఎంతో పవిత్రంగా, నిస్వార్థంగా నడిపిస్తున్న బ్లడ్ బ్యాంక్‌లో రక్తాన్ని అమ్ముకుంటున్నారంటూ కొంతమంది చేస్తున్న దారుణమైన ఆరోపణలు పూర్తిగా మూర్ఖత్వంతో కూడుకున్నవని ఆయన కొట్టిపారేశారు..

సినిమాల్లో తాను తీసుకునే భారీ పారితోషికంతో సమానమైన మొత్తాన్ని రక్తం విక్రయించడం ద్వారా సంపాదించాలంటే..అసలు ఎన్ని కోట్ల రక్తం ప్యాకెట్లను విక్రయించాల్సి ఉంటుందో విమర్శలు చేసేవారికి కనీస ఆలోచన ఉందా? అని చిరంజీవి ఘాటుగా ప్రశ్నించారు. ఎవరి వద్ద నుంచి ఎలాంటి డొనేషన్లు స్వీకరించకుండా, కేవలం తన సొంత కష్టార్జితంతోనే ఈ సేవా సంస్థను స్థాపించి నడుపుతున్నానని స్పష్టం చేశారు. రక్తదానం అనే పవిత్ర ప్రక్రియ ద్వారా వేలాది మంది ప్రాణాలను కాపాడుతున్న వేళ, ఇటువంటి పనికిమాలిన వ్యాఖ్యలను తాను ఎప్పుడూ ప్రాధాన్యం ఇవ్వనని, ధర్మమే తనను కాపాడుతుందని వ్యాఖ్యానించారు..!!

ram charan and sujeeth collaboration might happen?

after Profit-Sharing Model, ravi teja hikes remuneration!