
తాను చదివిన వైద్య విద్య, ఆ సమయంలో ఎదురైన అనుభవాలు ఒక నటిగా తనను ఎంతగానో ప్రభావితం చేశాయని ఆమె తెలిపారు. కార్తీక్ ఆర్యన్‌తో కలిసి తన తొలి బాలీవుడ్ చిత్రం విడుదలకు సిద్ధమవుతున్న నేపథ్యంలో, శ్రీలీల ఈ విషయాలను వెల్లడించారు. “వైద్య విద్య నా నటనకు కచ్చితంగా 100 శాతం ఉపయోగపడింది. ఒక నటికి/నటుడికి లోకజ్ఞానం, సాధారణ పరిజ్ఞానం చాలా అవసరం. ముఖ్యంగా అనుభవాలు, ఇతరుల పట్ల సున్నితంగా స్పందించే గుణం ఎక్కువగా ఉండాలి” అని శ్రీలీల అన్నారు..
తన MBBS మెడికల్ కోర్సులో భాగంగా హాస్పిటల్ పోస్టింగ్‌లకు వెళ్లినప్పుడు ఎన్నో నిజ జీవిత కథలను దగ్గరగా చూశానని ఆమె వివరించారు. “హాస్పిటల్‌లో ప్రజల భావోద్వేగ ప్రయాణాలను చాలా సమీపం నుంచి గమనించాను. అక్కడ జీవితం, మరణం రెండూ కనిపిస్తాయి. బిల్లులు కట్టడానికి ఆర్థికంగా ఇబ్బంది పడే వారిని చూశాను. ఇలాంటి ఎన్నో కథలు ఉంటాయి. అసలు సినిమా అంటేనే కథ కదా! రోజూ ఇలాంటి మూడు, నాలుగు కథలను చూడటం వల్ల ప్రపంచంపై నా దృక్పథం పూర్తిగా మారిపోయింది” అని శ్రీలీల వ్యాఖ్యానించారు..!!

