in

Keerthy Suresh reveals her Uncomfortable Flight Incident!

Keerthy Suresh reveals her Uncomfortable Flight Incident!

కీర్తీ సురేష్ తనకుఎదురైన ఓ చేదు అనుభవం గురించి తాజాగా ఓ ఇంటర్వ్యూలో పంచుకుంది. మిలన్ నుండి ఇండియాకు విమానంలో ప్రయాణిస్తున్నప్పుడు తనకు ఎదురైన ఈ చేదు ఘటనపై కీర్తి తాజాగా కొన్ని కామెంట్స్ చేసింది. ప్రయాణాల్లో ప్రజలతో మాట్లాడటం తనకు ఇష్టమే అయినప్పటికీ, కొందరు వ్యక్తులు లిమిట్స్ దాటి వ్యక్తిగత స్వేచ్ఛను గౌరవించరని ఆమె ఆవేదన వ్యక్తం చేసింది. విమానంలో తన భర్త ఆంటోనీ తట్టిల్‌తో కలిసి ప్రయాణిస్తుండగా, మద్యం మత్తులో ఉన్న ఒక వ్యక్తి ఆమె వద్దకు వచ్చి సెల్ఫీ కావాలని పట్టుబట్టాడు. సరిగ్గా నిలబడలేని స్థితిలో ఉన్న అతడిని కాసేపు వేచి చూడమని, తర్వాత ఫోటో దిగుతానని కీర్తి చెప్పినప్పటికీ..

అతను వినకుండా వెంటనే సెల్ఫీ తీసుకోవాలని ఒత్తిడి చేశాడు. ఈ క్రమంలో కీర్తి అతని ప్రవర్తనను తీవ్రంగా ఖండించాల్సి వచ్చింది. సాధారణంగా అభిమానుల పట్ల ఎంతో మృదువుగా ఉండే తన భర్త ఆంటోనీ, మొదటిసారిగా ఆ వ్యక్తిపై ఆగ్రహం వ్యక్తం చేయడాన్ని చూశానని ఆమె తెలిపింది. ఆ పరిస్థితిని అదుపు చేయడానికి వారు చివరకు విమాన సిబ్బంది సహాయం తీసుకోవాల్సి వచ్చింది. అయితే విమాన ప్రయాణాల్లో అభిమానులతో గడిపిన తీపి జ్ఞాపకాలు కూడా ఉన్నాయని, ఫోటోలు కూడా అడగకుండా ప్రయాణమంతా సాఫీగా కబుర్లు చెప్పే అభిమానులు కూడా ఉంటారని కీర్తీ సురేష్ పేర్కొంది. ప్రస్తుతం కీర్తి చెప్పిన ఈ విషయం నట్టింట వైరల్ అవుతోంది..!!

Rakul describes Surpanakha as ‘misunderstood and layered’ character!