in

Shalini Pandey breaks her silence after a fake AI-generated video!

ర్జున్ రెడ్డి’ చిత్రంతో తెలుగు ప్రేక్షకులకు చేరువైన నటి షాలినీ పాండే, తనపై ఆన్‌లైన్‌లో వైరల్ అవుతున్న డీప్‌ఫేక్ వీడియోపై తీవ్రంగా స్పందించారు. ఇది పూర్తిగా కల్పితమని, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ AI సాంకేతికతతో సృష్టించిన నకిలీ వీడియో అని ఆమె స్పష్టం చేశారు. ఈ మేరకు ఆమె తన ఇన్‌స్టాగ్రామ్ వేదికగా ఒక పోస్ట్ చేశారు..

“ఆన్‌లైన్‌లో ప్రచారమవుతున్న ఆ వీడియో పూర్తిగా అవాస్తవం. అందులో ఉన్నది నేను కాదు” అని షాలినీ స్పష్టం చేశారు. సాంకేతికతను దుర్వినియోగం చేస్తూ వ్యక్తులను, ముఖ్యంగా మహిళలను లక్ష్యంగా చేసుకోవడం తనను తీవ్రంగా కలచివేసిందని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు. ఇలాంటి చర్యలను ఎట్టిపరిస్థితుల్లోనూ సహించకూడదని, ఇది ఒక రకమైన వేధింపేనని ఆమె పేర్కొన్నరు. ఈ సందర్భంగా ఆమె ప్రజలకు ఒక ముఖ్యమైన విజ్ఞప్తి చేశారు. ఆ నకిలీ వీడియోను ఎవరూ షేర్ చేయవద్దని, ఇతరులకు పంపవద్దని, అలాగే డౌన్‌లోడ్ చేయవద్దని కోరారు..!!

Trisha, tamannah in talks for Nandini Reddy’s supernatural thriller!