in

ramayana promotions, a new headache for sai pallavi!

Keerthy Suresh reveals her Uncomfortable Flight Incident!

సున్నితమైన అంశాల గురించి మాట్లాడేటప్పుడు ఆమె చెప్పాలనుకున్న భావం కంటే, ఆమె ఉపయోగించిన పదాలపైనే ఎక్కువ చర్చ జరిగింది. ఒక ఇంటర్వ్యూలో తనలో అభివృద్ధి చేసుకోవాల్సిన స్కిల్ ఏమిటని అడిగినప్పుడు కూడా ఆమె ఆసక్తికరమైన సమాధానం ఇచ్చారు. తన మనసులోని భావాలను సరైన మాటలతో కమ్యూనికేట్ చేయలేకపోతుంటానని, ఆ నైపుణ్యాన్ని మెరుగుపరుచుకోవాలని ఉందని చెప్పారు. తాజాగా ‘రామాయణం’ సినిమా నేపథ్యంలో రావణుడి పాత్ర గురించి ఆమె చేసిన వ్యాఖ్యలు కూడా చర్చకు దారితీశాయి.

ఆమె చెప్పాలనుకున్న అసలు ఉద్దేశం ఏమిటన్నది పక్కన పెడితే, ఆ వ్యాఖ్యలు మాత్రం వివాదాస్పదంగా మారాయి. దీంతో ఆమె మాటలపై సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున చర్చ జరిగింది. అయితే తాజాగా ‘రామాయణం’ సినిమా గురించి ఇచ్చిన ఇంటర్వ్యూలో మాత్రం సాయి పల్లవి వివాదాస్పద అంశాల జోలికి వెళ్లకుండా జాగ్రత్తగా మాట్లాడినట్లు కనిపించింది. నిజానికి ఇది ఆమెకు అవసరమైన జాగ్రత్తే. ఎందుకంటే రామాయణం వంటి ఇతిహాసాల ఆధారంగా తెరకెక్కే సినిమాల విషయంలో ప్రేక్షకుల భావోద్వేగాలు, అభిప్రాయాలు చాలా సున్నితంగా ఉంటాయి. ఇలాంటి సందర్భాల్లో చిన్న మాట కూడా పెద్ద చర్చకు దారితీయవచ్చు..!!

Keerthy Suresh reveals her Uncomfortable Flight Incident!