
గాడ్ ఆఫ్ మాసెస్ నందమూరి బాలకృష్ణ, స్టార్ డైరెక్టర్ కొరటాల శివ కాంబినేషన్‌లో రాబోతున్న భారీ యాక్షన్ ఎంటర్‌టైనర్‌పై ఒక ఆసక్తికరమైన వార్త నెట్టింట వైరల్ అవుతోంది. ఈ క్రేజీ ప్రాజెక్ట్‌లో టాలెంటెడ్ తెలుగు నటి ఐశ్వర్య రాజేష్ ఒక కీలక పాత్రలో నటించనున్నట్లు సమాచారం. అయితే, ఆమె ఇందులో హీరోయిన్‌గా కాకుండా పూర్తి నెగిటివ్ షేడ్స్ ఉన్న ఒక పవర్‌ఫుల్ పాత్రలో కనిపించబోతున్నట్లు టాక్. యువసుధా ఆర్ట్స్, ఎస్‌ఎల్‌వి సినిమాస్ సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ ప్రతిష్టాత్మక చిత్రంపై ఇంకా అధికారిక ప్రకటన రావాల్సి ఉంది. బాలయ్యకు విలన్‌గా ఐశ్వర్య రాజేష్ నటిస్తే సినిమా నెక్స్ట్ లెవెల్‌లో ఉంటుందని ఫ్యాన్స్ భావిస్తున్నారు..!!

