
గ్లోబల్ స్టార్ రామ్ చరణ్, సెన్సేషనల్ డైరెక్టర్ సుకుమార్ కలయికలో రాబోతున్న చిత్రం RC17 పై సినీ వర్గాల్లో అంచనాలు రోజురోజుకు పెరిగిపోతున్నాయి. వీరిద్దరి కాంబినేషన్లో గతంలో వచ్చిన ‘రంగస్థలం’ ఇండస్ట్రీ హిట్‌గా నిలవడం, ఆ తర్వాత సుకుమార్ దర్శకత్వంలో ‘పుష్ప’ ఫ్రాంచైజీ సినిమాలు చరిత్ర సృష్టించడం నేపథ్యంలో..ఈ కొత్త ప్రాజెక్ట్‌పై సర్వత్రా ఆసక్తి నెలకొంది. ప్రస్తుతం స్క్రిప్ట్ పనులు తుది దశకు చేరుకున్న ఈ సినిమాని త్వరలోనే సెట్స్ పైకి తీసుకెళ్లేందుకు సన్నాహాలు జరుగుతున్నాయి..
ఈ క్రమంలో సినిమాలో హీరోయిన్ ఎవరనే దానిపై ఆసక్తికరమైన చర్చ నడుస్తోంది. మొదట కియారా అద్వానీ పేరు వినిపించినా, తాజాగా నేషనల్ క్రష్ రష్మిక మందన్న పేరు బలంగా వినిపిస్తోంది. సుకుమార్ దర్శకత్వంలో వచ్చిన ‘పుష్ప’ సిరీస్‌తో రష్మిక పాన్-ఇండియా స్థాయిలో స్టార్డమ్ సంపాదించుకుంది. ఆ చిత్రంలో ఆమె నటనకు దేశవ్యాప్తంగా ప్రశంసలు దక్కాయి. ఇప్పుడు ‘ఆర్సీ17’ కోసం సుకుమార్ ఒక బలమైన, కథను మలుపు తిప్పే మహిళా పాత్రను రాసుకున్నారని, ఆ పాత్రకు రష్మిక అయితేనే పూర్తి న్యాయం చేయగలదని ఆయన భావిస్తున్నట్లు సమాచారం. ఆమెకున్న పాన్-ఇండియా ఇమేజ్ కూడా సినిమాకు అదనపు ఆకర్షణగా నిలుస్తుందని చిత్రబృందం అంచనా వేస్తోంది..!!

