in

Kajal Aggarwal Opens Up on Breakup With Gautam!

Kajal Aggarwal Opens Up on Breakup With Gautam

Kajal Aggarwal Opens Up on Breakup With Gautam

Kajal Aggarwal Opens Up on Breakup With Gautam!

As Posted on Website HMTV

అందం, అభినయంతో ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న నటి కాజల్ అగర్వాల్ తన వ్యక్తిగత జీవితానికి సంబంధించిన ఆసక్తికర విషయాలను తాజాగా బయటపెట్టింది. ముఖ్యంగా తన భర్త గౌతమ్ కిచ్లూతో ప్రేమ ప్రయాణం, మధ్యలో ఎదురైన విభేదాలు, విడిపోవడం, తిరిగి ఒక్కటవడం వంటి విషయాలను ఓ ఇంటర్వ్యూలో వెల్లడించింది. సాధారణంగా సెలబ్రిటీల ప్రేమకథలు ఎంతో సాఫీగా సాగుతాయని అనుకుంటాం. కానీ తన ప్రేమ ప్రయాణంలోనూ ఎన్నో మలుపులు ఉన్నాయని కాజల్ చెప్పుకొచ్చింది. ఒకానొక సమయంలో ఇద్దరూ విడిపోయి వేర్వేరు వ్యక్తులతో డేటింగ్ చేసినప్పటికీ, చివరకు తమ బంధంలోని విలువను గుర్తించి మళ్లీ ఒక్కటయ్యామని తెలిపింది. ‘హ్యూమన్స్ ఆఫ్ బాంబే’కు ఇచ్చిన ఇంటర్వ్యూలో కాజల్ తన ప్రేమకథ గురించి పలు ఆసక్తికర విషయాలను పంచుకుంది. సుమారు 13 ఏళ్ల క్రితం ఓ స్నేహితుడి పెళ్లిలో ఉమ్మడి స్నేహితుల ద్వారా గౌతమ్ పరిచయమయ్యాడని చెప్పింది.

ఆ పరిచయం క్రమంగా స్నేహంగా, ఆ తర్వాత ప్రేమగా మారిందని వెల్లడించింది. కొంతకాలం ఇద్దరూ ప్రేమలో ఉన్నప్పటికీ, కొన్ని కారణాల వల్ల విడిపోవాల్సి వచ్చిందట. అయితే విడిపోయిన తర్వాత కూడా ఒకరితో ఒకరు స్నేహాన్ని కొనసాగించారని, ఆ సమయంలో ఇద్దరూ ఇతర వ్యక్తులతో డేటింగ్ చేసినట్లు కాజల్ వెల్లడించింది. అయినప్పటికీ తమ జీవితాల్లో ఒకరికొకరు ప్రత్యేకమైన స్థానాన్ని కలిగి ఉన్నామని చెప్పింది. ఇక కరోనా మహమ్మారి కారణంగా దేశవ్యాప్తంగా లాక్‌డౌన్ విధించడంతో తమ జీవితాల గురించి ఆలోచించడానికి ఎక్కువ సమయం దొరికిందని కాజల్ తెలిపింది. అప్పటివరకు సినిమాలు, షూటింగులు, వృత్తిపరమైన బాధ్యతలతో బిజీగా గడిపిన తమకు వ్యక్తిగత జీవితంపై దృష్టి పెట్టే అవకాశం లభించిందని చెప్పింది. కొన్ని వారాల పాటు కలుసుకోకపోవడంతో ఒకరికి మరొకరు ఎంత అవసరమో అర్థమైందని వివరించింది. మళ్లీ కలిసిన తర్వాత తమ బంధంపై స్పష్టత తీసుకోవాలని నిర్ణయించుకుందట.

ఈ క్రమంలో గౌతమ్‌తో మాట్లాడుతూ..’ఈసారి పెళ్లి చేసుకో..లేదంటే గుడ్‌బై’ అని సరదాగా, అదే సమయంలో స్పష్టంగా చెప్పినట్లు గుర్తుచేసుకుంది. ఎన్నో ఏళ్లుగా ఒకరినొకరు తెలుసుకోవడంతో తమ మధ్య ప్రత్యేకమైన అనుబంధం ఏర్పడిందని పేర్కొంది. అలా మళ్లీ ఒక్కటైన ఈ జంట 2020 జూన్‌లో నిశ్చితార్థం చేసుకుంది. అనంతరం అదే ఏడాది అక్టోబర్ 30న ముంబైలో కుటుంబ సభ్యులు, అత్యంత సన్నిహితుల సమక్షంలో వివాహ బంధంలోకి అడుగుపెట్టారు. పెళ్లి తర్వాత కూడా కాజల్ సినిమాల్లో నటిస్తూ తన కెరీర్‌ను కొనసాగిస్తోంది. ఇక ఈ దంపతులకు కుమారుడు నీల్ జన్మించడంతో వారి కుటుంబంలో ఆనందం మరింత పెరిగింది. ఇటీవల ‘రామాయణం’ చిత్రంలో రావణుడి భార్య మండోదరి పాత్రలో కనిపించిన కాజల్, తాజా ఇంటర్వ్యూలో తన ప్రేమ, పెళ్లి ప్రయాణాన్ని పంచుకోవడంతో ఆమె వ్యక్తిగత జీవితానికి సంబంధించిన ఈ ఆసక్తికర విషయాలు మరోసారి వార్తల్లో నిలిచాయి..!!

ALSO READ — Kajal Aggarwal’s Limited Role in Ramayana Angers Fans

Ram Charan's Story Goes to Chiranjeevi-Trivikram!

Ram Charan’s Story Goes to Chiranjeevi-Trivikram!