in

Alia Bhatt has joined the cast of Kalki 2898 AD Part 2?

ల్కి-2 చిత్రంలో అమితాబ్ బచ్చన్, కమల్ హాసన్ వంటి దిగ్గజ నటులు కీలక పాత్రల్లో కనిపించనుండగా, షూటింగ్ కూడా ఇప్పటికే ప్రారంభమైంది. గత కొంత కాలంగా ఈ సినిమాలో బాలీవుడ్ స్టార్ హీరోయిన్ ఆలియా భట్ కీలక పాత్రలో నటించబోతున్నారనే వార్తలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. దీనిపై అధికారిక ప్రకటన లేకపోయినా, తాజాగా ప్రభాస్ చేసిన ఓ సోషల్ మీడియా పోస్ట్ ఈ ప్రచారానికి మరింత ఊతమిచ్చింది. ఆలియా ప్రధాన పాత్రలో నటిస్తున్న తాజా యాక్షన్ చిత్రం ఆల్ఫా ట్రైలర్‌ను ప్రభాస్ తన ఇన్‌స్టాగ్రామ్ స్టోరీలో షేర్ చేశారు..

ఆల్ఫా ట్రైలర్ అద్భుతంగా ఉంది. జూలై 3న విడుదల కానున్న ఈ చిత్రానికి ఆలియా భట్‌తో పాటు దర్శకుడు, చిత్ర బృందం మొత్తానికి శుభాకాంక్షలు అంటూ ఆయన పోస్ట్ చేశారు. ప్రభాస్ పోస్ట్‌కు స్పందించిన ఆలియా భట్, దాన్ని తన సోషల్ మీడియా ఖాతాలో రీషేర్ చేస్తూ ఆయనకు ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలిపారు. దీంతో వీరిద్దరి మధ్య జరిగిన ఈ సోషల్ మీడియా సంభాషణ ప్రస్తుతం వైరల్‌గా మారింది. ఆలియా భట్ కల్కి-2 లో నటించబోతున్నారనే ప్రచారానికి ఇది పరోక్ష సంకేతమా? అంటూ అభిమానులు సోషల్ మీడియాలో చర్చించుకుంటున్నారు..!!

kiara advani in ram charan sukumar combo movie?