in

kiara advani in ram charan sukumar combo movie?

మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ వరుస పాన్ ఇండియా చిత్రాలతో బిజీగా ఉన్నారు. ఇటీవల విడుదలైన పెద్ది సినిమాతో ప్రేక్షకులను ఆకట్టుకున్న ఆయన, తదుపరి చిత్రాన్ని స్టార్ దర్శకుడు సుకుమార్ దర్శకత్వంలో చేయడానికి సిద్ధమవుతున్నారు. ప్రస్తుతం RC17 అనే వర్కింగ్ టైటిల్‌తో ఈ ప్రాజెక్ట్‌కు సంబంధించిన ప్రీ-ప్రొడక్షన్ పనులు జరుగుతున్నాయి. తాజా సమాచారం ప్రకారం, ఈ సినిమాలో హీరోయిన్‌గా కియారా అద్వానీను ఎంపిక చేసే దిశగా చిత్రబృందం ఆలోచిస్తున్నట్లు సినీ వర్గాల్లో ప్రచారం జరుగుతోంది. ఇప్పటికే ఆమెతో ప్రాథమిక చర్చలు కూడా జరిగినట్లు టాక్ వినిపిస్తోంది..

ఇంతకుముందు రామ్ చరణ్, కియారా అద్వానీ కలిసి వినయ విధేయ రామ, గేమ్ ఛేంజర్ చిత్రాల్లో నటించారు. ఇప్పుడు ఈ జోడీ మరోసారి తెరపై కనిపించే అవకాశం ఉందనే వార్త అభిమానుల్లో ఆసక్తి రేకెత్తిస్తోంది. సుకుమార్ ప్రస్తుతం కథతో పాటు సాంకేతిక బృందం ఎంపికపై ప్రత్యేక దృష్టి పెట్టినట్లు సమాచారం. అన్ని పనులు పూర్తయిన తర్వాత ఈ చిత్రానికి సంబంధించిన అధికారిక ప్రకటన వెలువడే అవకాశం ఉందని సినీ వర్గాలు చెబుతున్నాయి. అయితే, కియారా అద్వానీ హీరోయిన్‌గా ఎంపికైన విషయంపై చిత్రబృందం నుంచి ఇప్పటివరకు ఎలాంటి అధికారిక ప్రకటన రాలేదు..!!

Akhil enthusiastic support for Samantha’s ‘Maa Inti Bangaram’!

Alia Bhatt has joined the cast of Kalki 2898 AD Part 2?