in

Akhil enthusiastic support for Samantha’s ‘Maa Inti Bangaram’!

మంత ప్రధాన పాత్రలో నటించిన ‘మా ఇంటి బంగారం’ సినిమా గురించి అఖిల్ స్పందిస్తూ..తాను ఈ సినిమాను ఇంకా చూడలేదని, కానీ సినిమాపై చాలా పాజిటివ్ వైబ్స్ ఉన్నాయని వెల్లడించారు. నేను ‘మా ఇంటి బంగారం’ ట్రైలర్ చూశాను. అందులో సమంత యాక్టింగ్ సూపర్బ్‌గా ఉంది. ఆ ట్రైలర్ చూడగానే ఈ సినిమా ఖచ్చితంగా హిట్ కొడుతుందని నాకు అనిపించింది. ఈ అద్భుతమైన ప్రయత్నానికి సమంతతో పాటు చిత్ర యూనిట్ మొత్తానికి నా హృదయపూర్వక శుభాకాంక్షలు అంటూ అఖిల్ ప్రశంసల జల్లు కురిపించారు.

ఒకప్పుడు ఒకే కుటుంబానికి చెందిన వారైన అఖిల్..సమంత సినిమాపై ఇలా ఓపెన్‌గా పాజిటివ్ కామెంట్స్ చేయడంతో అక్కినేని మరియు సమంత ఫ్యాన్స్ ఖుషీ అవుతున్నారు. ప్రస్తుతం ఈ కామెంట్స్ నెట్టింట తెగ వైరల్ అవుతున్నాయి.ఇక అఖిల్ నటిస్తున్న ‘లెనిన్’ చిత్రం విషయానికి వస్తే..ప్యూర్ రాయలసీమ పల్లెటూరి నేపథ్యంలో ఈ సినిమా తెరకెక్కింది. అఖిల్ మాస్ అండ్ రగ్గడ్ లుక్ ఇప్పటికే ప్రేక్షకుల్లో భారీ అంచనాలను పెంచేసింది. జూలై 10వ తేదీన గ్రాండ్‌గా థియేటర్లలోకి రానుంది. అఖిల్ సరసన భాగ్యశ్రీ నటిస్తోంది. ‘వినరో భాగ్యం విష్ణు కథ’ ఫేమ్ మురళీ కిషోర్ అబ్బూరి ఈ చిత్రానికి దర్శకత్వం వహించారు.!!

actor Suriya has no intention of entering politics!

kiara advani in ram charan sukumar combo movie?