in

Rajasekhar Playing a Villain In Balakrishna And Koratala Movie?

టసింహం నందమూరి బాలకృష్ణ, సక్సెస్‌ఫుల్ డైరెక్టర్ కొరటాల శివ కాంబినేషన్‌లో ఒక భారీ ప్రాజెక్ట్ పట్టాలెక్కబోతున్న సంగతి తెలిసిందే. ఇప్పటికే ఈ చిత్రానికి సంబంధించిన ప్రీ-ప్రొడక్షన్ పనులు దాదాపు చివరి దశకు చేరుకున్నాయి. ‘దేవర’ వంటి భారీ విజయం తర్వాత కొరటాల శివ స్క్రిప్ట్ వండుతుండటంతో ఈ సినిమాపై అంచనాలు భారీగా ఉన్నాయి. ఈ నేపథ్యంలో తాజాగా ఈ మూవీకి సంబంధించిన ఒక సంచలన వార్త ఫిలిం నగర్ వర్గాల్లో, సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్‌గా మారింది..

ఈ క్రేజీ ప్రాజెక్ట్‌లో విలన్ పాత్ర కోసం దర్శకుడు కొరటాల శివ ఒక ఊహించని పేరును తెరపైకి తెచ్చారు. సీనియర్ హీరో, యాంగ్రీ యంగ్ మ్యాన్ రాజశేఖర్ ఈ సినిమాలో బాలకృష్ణకు విలన్‌గా నటించబోతున్నట్లు గట్టిగా టాక్ వినిపిస్తోంది. ఇప్పటికే మూవీ టీమ్ ఆయనను సంప్రదించగా, కథలోని పవర్‌ఫుల్ క్యారెక్టరైజేషన్ నచ్చి రాజశేఖర్ కూడా సానుకూలంగా స్పందించినట్లు తెలుస్తోంది. వెండితెరపై బాలయ్య – రాజశేఖర్ తలపడితే థియేటర్లలో పూనకాలు రావడం ఖాయం. ఈ ఇద్దరి మధ్య వచ్చే మైండ్ గేమ్ అండ్ యాక్షన్ సీన్స్ సినిమాకే హైలైట్‌గా నిలవనున్నాయట..!!!

SOUTH INDIAN HEROINE WHO IMPRESSED NEHRU!