
గ్లామర్ రోల్స్ మాత్రమే కాకుండా, బలమైన సెంటిమెంట్ మరియు భావోద్వేగాలు ఉన్న కుటుంబ కథా చిత్రాలలో నటించాలని తన కోరిక అని శ్రీలీల ఒక ఇంటర్వ్యూలో వెల్లడించారు. అటువంటి సినిమాల్లో అయితేనే తన నటనను నిరూపించుకోవడానికి ఎక్కువ ఆస్కారం ఉంటుందని ఆమె అభిప్రాయపడ్డారు. కేవలం డ్యాన్సులకే పరిమితం కాకుండా, ప్రేక్షకుల హృదయాలను హత్తుకునే పాత్రలు చేయాలని, వైవిధ్యభరితమైన కథలు తనను కెరీర్ పరంగా ‘నెక్స్ట్ లెవల్’కు తీసుకెళ్తాయని ఆమె ఆశాభావం వ్యక్తం చేశారు..తెలుగులో శ్రీలీల ఇటీవల నటించిన చిత్రాలు ఆమెకు ఆశించిన ఫలితాలను అందించలేకపోయాయి..
నితిన్ సరసన నటించిన ‘రాబిన్ హుడ్’, అలాగే ‘మాస్ జాతర’, పవన్ కళ్యాణ్ ‘ఉస్తాద్ భగత్ సింగ్’ సినిమాలు బాక్సాఫీస్ వద్ద ఆశించిన మేర ప్రభావాన్ని చూపలేకపోయాయి. దీంతో తన తదుపరి ప్రాజెక్టుల విషయంలో ఆమె ఆచితూచి అడుగులు వేస్తున్నారు. కేవలం కమర్షియల్ చిత్రాలనే కాకుండా కంటెంట్ ఉన్న సినిమాలకు ప్రాధాన్యత ఇవ్వాలని ఆమె భావిస్తున్నారు. తెలుగులో ఫలితాలు ఎలా ఉన్నా, శ్రీలీలకు కోలీవుడ్‌లో బంపర్ ఆఫర్ దక్కింది. ప్రముఖ తమిళ హీరో ధనుష్ సరసన ఆయన 55వ చిత్రంలో కథానాయికగా శ్రీలీల నటిస్తున్నారు. ధనుష్ వంటి ప్రతిభావంతుడైన నటుడితో పని చేయడం తన కెరీర్‌కు ప్లస్ అవుతుందని ఆమె భావిస్తున్నారు..!!
