in

Balakrishna teaming up with class director Sekhar Kammula?

తెలుగు చలనచిత్ర పరిశ్రమలో అప్పుడప్పుడు కొన్ని ఊహించని కాంబినేషన్లు ప్రకటితమై ప్రేక్షకులను విస్మయానికి గురిచేస్తుంటాయి. తాజాగా ఫిల్మ్ నగర్ వర్గాల్లో అలాంటి ఒక సెన్సేషనల్ వార్త హల్‌చల్ చేస్తోంది. టాలీవుడ్ మాస్ పవర్ హౌస్, ‘గాడ్ ఆఫ్ మాసెస్’ నందమూరి బాలకృష్ణ , సెన్సిబుల్ చిత్రాల దర్శకుడు శేఖర్ కమ్ముల కలిసి ఒక సినిమా చేయబోతున్నారనే వార్త ఇప్పుడు హాట్ టాపిక్‌గా మారింది. వినడానికి ఇది కాస్త వింతగా అనిపించినా, ఈ ప్రాజెక్ట్ గనుక పట్టాలెక్కితే టాలీవుడ్‌లో ఇది ఒక మోస్ట్ అన్‌ఎక్స్‌పెక్టెడ్ వండర్ అవుతుందని విశ్లేషకులు భావిస్తున్నారు..

సాధారణంగా శేఖర్ కమ్ముల అనగానే మనకు ‘ఆనంద్’, ‘గోదావరి’, ‘ఫిదా’ వంటి సున్నితమైన భావోద్వేగాలు, సహజమైన పాత్రలు గుర్తుకు వస్తాయి. ఆయన మేకింగ్ స్టైల్ చాలా క్లాస్‌గా ఉంటుంది. మరోవైపు, బాలయ్య సినిమా అంటే హై-వోల్టేజ్ యాక్షన్, పవర్‌ఫుల్ డైలాగ్స్, థియేటర్లలో మాస్ జాతర ఉండాల్సిందే. ఇలాంటి భిన్నమైన ధ్రువాల వంటి ఇద్దరు వ్యక్తులు జతకట్టడం ఇప్పుడు అందరి దృష్టిని ఆకర్షిస్తోంది. శేఖర్ కమ్ముల ఇప్పుడు బాలయ్య బాడీ లాంగ్వేజ్‌కు తగినట్టుగా, తన మార్క్ నేటివిటీని జోడించి ఒక విభిన్నమైన కథను సిద్ధం చేసినట్లు సమాచారం..!!

Kiara Advani Instagram story Toxic intimate scenes controversy response

Kiara Advani Reacts to Viral Rumors About Yash’s Toxic

Sreeleela wants to Step Out of Her Comfort Zone!