in

manasa varanasi replaces mrunal thakur for peddi?

మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ నటిస్తున్న తాజా చిత్రం ‘పెద్ది’ విడుదల తేదీ మారే అవకాశమున్నట్లు సినీ వర్గాల్లో వార్తలు వినిపిస్తున్నాయి. ఈ సినిమా మొదటగా ఏప్రిల్ 30న విడుదల కావాల్సి ఉండగా, ఆ తేదీకి రావడం కష్టమని సమాచారం. త్వరలోనే కొత్త రిలీజ్ డేట్‌పై చిత్ర యూనిట్ అధికారిక ప్రకటన చేసే అవకాశం ఉంది. ఇక ఈ సినిమా గురించి మరో ఆసక్తికర వార్త సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. యువ నటి మానస వారణాసి ఈ సినిమాలో రామ్ చరణ్‌తో కలిసి ఒక స్పెషల్ సాంగ్‌లో డ్యాన్స్ చేయనున్నట్లు టాక్ వినిపిస్తోంది..

ఇప్పటివరకు చాలా సాఫ్ట్ ఇమేజ్‌తో కనిపించిన మానస ఇలా గ్లామర్ సాంగ్ చేయడం అభిమానుల్లో ఆసక్తిని పెంచుతోంది. ఈ పాట ప్రేక్షకులను ఆకట్టుకుంటే మానస వారణాసి కెరీర్‌కు పెద్ద ప్లస్ అవుతుందని సినీ విశ్లేషకులు అంటున్నారు. అయితే ఈ వార్తలపై ఇప్పటివరకు చిత్ర యూనిట్ నుంచి అధికారిక ప్రకటన రాలేదు. ఈ సినిమాలో హీరోయిన్‌గా జాన్వీ కపూర్ నటిస్తుండగా, సంగీతాన్ని ఏఆర్ రెహమాన్ అందిస్తున్నారు. అంతకుముందు ఈ సాంగ్ కోసం మృణాల్ ఠాకూర్ను సంప్రదించగా ఆమె తిరస్కరించినట్లు సమాచారం..!!

Dacoit!

pooja hegde doing a special song for rowdy janardhan!