in

kriti shetty opens up about iron leg comments!

టాలీవుడ్‌లో వరుస పరాజయాలతో సతమతమవుతున్న యంగ్ హీరోయిన్ కృతి శెట్టి, తనపై వస్తున్న ‘ఐరన్ లెగ్’ విమర్శలపై తాజాగా స్పందించారు. ఒక సినిమా విజయం కేవలం నటీనటుల చేతుల్లో పూర్తిగా ఉండదని, అలాంటి సమయంలో తనను లక్ష్యంగా చేసుకుని ఈ విధంగా ముద్ర వేయడం తీవ్రంగా బాధిస్తోందని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు. ప్రతి సినిమాకు తాను వంద శాతం కష్టపడతానని, పాత్రకు న్యాయం చేసేందుకు ఎక్కడా రాజీ పడనని కృతి స్పష్టం చేశారు..

సినిమా ఫలితం అనేది కథ, దర్శకత్వం, సాంకేతిక అంశాలు వంటి అనేక విషయాలపై ఆధారపడి ఉంటుందని తెలిపారు. కేవలం తనను బాధ్యురాలిని చేస్తూ విమర్శించడం సరైంది కాదని, కొన్నిసార్లు అదృష్టం లేకపోవడం వల్లే అవకాశాలు చేజారిపోవడం ఒక నటిగా తనను కృంగదీస్తోందని వాపోయారు. తాను నటిస్తున్న ‘లవ్ ఇన్సూరెన్స్ కంపెనీ’ చిత్రంపై వస్తున్న సందేహాలు కూడా తనను కలవరపెడుతున్నాయని అన్నారు. రీర్‌లో ఎదురవుతున్న ఇబ్బందుల నడుమ సీనియర్ నటి నయనతార తనకు అండగా నిలిచిన విషయాన్ని కృతి గుర్తుచేసుకున్నారు..!!

55 YEARS FOR MARO PRAPANCHAM!

Dacoit!