in

Prabhas playing an important role in Mahakhali!

నుమాన్’ సినిమాతో తెలుగు సినిమా సత్తాను ప్రపంచానికి చాటిన దర్శకుడు ప్రశాంత్ వర్మ, భారతీయ ఇతిహాసాలను ఆధునిక సూపర్ హీరో కథలతో ముడిపెట్టి ఒక సరికొత్త మాయాలోకాన్ని సృష్టించారు. ఇప్పుడు ఆ యూనివర్స్ నుండి వస్తున్న తొలి ఫీమేల్ సూపర్ హీరో చిత్రం ‘మహాకాళి’. అయితే, ఈ సినిమాలో కేవలం యాక్షన్ మాత్రమే కాదు, ఊహించని ఒక భారీ సర్ ప్రైజ్ దాగి ఉందట. అదే పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ ఎంట్రీ..

సాధారణంగా ప్రభాస్ లాంటి స్టార్ నటుడు ఒక సినిమాలో ఉన్నారంటే హంగామా మామూలుగా ఉండదు. కానీ, ప్రశాంత్ వర్మ అత్యంత రహస్యంగా ప్రభాస్ పాత్రకు సంబంధించిన షూటింగ్‌ను పూర్తి చేశారని ఇండస్ట్రీ వర్గాల్లో గట్టిగా వినిపిస్తోంది. ఈ పాత్ర నిడివి తక్కువైనా, సినిమా కథను మలుపు తిప్పే స్థాయిలో ఉంటుందని సమాచారం. ఒకవేళ థియేటర్‌లో ప్రభాస్ ఎంట్రీ పడితే, ఆ విజువల్స్ చూసి అభిమానులకు పూనకాలు రావడం ఖాయం. ప్రశాంత్ వర్మ మేకింగ్ స్టైల్, ప్రభాస్ కటౌట్ తోడైతే బాక్సాఫీస్ వద్ద రికార్డులు తిరగరాయాల్సిందే..!!

Sai Pallavi reveals dosent have good opinion on Marriage!

hot beauty dimple hayathi on board for balakrishna’s next!