శ్రీలీల కోలీవుడ్ ఎంట్రీ ఫిక్స్ !
ఒక్క పాట శ్రీలీల కెరియర్ ని సెట్ చేసింది. దీనితో వరుస ఆఫర్స్ తో మళ్ళీ బిజీగా మారిపోయింది శ్రీలీల. తెలుగు, తమిళం, హిందీ భాషల్లో వరుస ఛాన్స్ లతో లక్కీ చామ్ గా మారిపోయింది. ప్రజంట్ తెలుగులో అరడజను సినిమాలకి పైగా తన చేతిలో ఉన్నాయి. నితిన్, సిద్దు జొన్నల గడ్డ, నవీన్ పోలిశెట్టి, రవి తేజ, నాగ చైతన్య, అఖిల్ వీరితో సినిమాలు కమిట్ అయ్యింది.
శివ కార్తికేయన్’ సినిమాతో హీరోయిన్ శ్రీలేల
కోలీవుడ్ లో ‘శివ కార్తికేయన్‘ సినిమాతో ఎంట్రీ ఇస్తోంది. వీటి తోపాటు బాలీవుడ్ లో కూడా వరుస ఆఫర్స్ వస్తున్నాయి శ్రీలీలకి. ఇప్పటికే సైఫ్ ఆలీఖాన్ వారసుడు ఇబ్రహీం ఆలీఖాన్ తో ఒక సినిమా కమిట్ అయ్యింది. ఇవి కాక చాలా ఆఫర్స్ వస్తున్నాయని టాక్. పుష్ప 2 లో శ్రీలీల చేసిన ఐటెం సాంగ్ తో బాలీవుడ్ లో కూడా పాపులారిటీ పెంచుకుంది. ఈ క్రమంలో బాలీవుడ్ ప్రొడ్యూసర్స్ శ్రీలీలని కాంటాక్ట్ చేస్తున్నారట. ఇప్పుడు కూడా ఓ భారీ ఆఫర్ కొట్టేసింది.!!