in

Harish Shankar Confirms Aavesham Remake with Balakrishna!

హరీష్ శంకర్ తో బాలయ్య సినిమా?
పవన్ కళ్యాణ్, బన్నీ, వరుణ్ తేజ్ లాంటి హీరోలతో కలిసి వర్క్ చేసిన హరీష్ ద్రుష్టి ఇప్పుడు నందమూరి హీరోలపై పడింది. ఫుల్ ఫామ్ లో ఉన్న బాలయ్యతో సినిమా చేసేందుకు హరీష్ ఆసక్తి చూపిస్తున్నాడు. హరీష్ లాంటి మాస్ యాక్షన్ దర్శకుడుకి బాలయ్య లాంటి స్టార్ దొరికితే ‘దబిడి దిబిడే‘.

పవన్ కళ్యాణ్ డైరెక్టర్ తో బాలయ్య హరీష్ శంకర్ సినిమా
హరీష్ మొదట రామ్ పోతినేని కోసం ట్రై చేశాడని కానీ కుదరలేదని, ఈ నేపథ్యంలో హరీష్ ద్రుష్టి బాలయ్య పై పడినట్లు తెలుస్తోంది. ఇప్పటికే స్క్రిప్ట్ వర్క్ మొదలు పెట్టాడని, లాస్ట్ స్టేజ్ లో ఉందని సమాచారం. ఇంతకముందు కూడా హరీష్, బాలయ్య కాంబో మూవీపై వార్తలు వచ్చాయి కానీ సెట్ అవలేదు. ఇప్పుడు పక్కా అని టాక్. రీమేక్ కథలనే నమ్ముకునే హరీష్ ఈ సారి కూడా బాలయ్యతో రీమేక్ ట్రై చేయనున్నారని తెలుస్తోంది. గత ఏడాది మలయాళం వచ్చిన బ్లాక్ బస్టర్ మూవీ ‘ఆవేశం‘ రీమేక్ చేయనున్నారని సమాచారం..!!

Meenakshi Chaudhary having a wonderful 2025!