పార్ట్ వన్ సౌత్ తో పాటు నార్త్ లో కూడా ప్రభంజనం సృష్టించింది. దీనితో పుష్ప 2 పై క్రేజ్ పెరిగింది. ఆ క్రేజే మార్కెట్ ని కూడా పెంచింది. ఎంతలా అంటే ఒక కమర్షియల్ మూవీ రిలీజ్ కి ముందే ప్రీ రిలీజ్ బిజినెస్ తోనే1000 కోట్లు కలక్ట్ చేసింది. ఒక తెలుగు సినిమా బిజినెస్ ఈ స్థాయిలో జరగటం రికార్డ్ అనే చెప్పాలి.
అన్ని భాషల రైట్స్, ఓవర్సీస్, శాటిలైట్ , డిజిటల్ ఇలా అన్ని కలిపి వెయ్యి కోట్లు దాటిపోయిందని ట్రేడ్ పండితులు అంచనా. రెండు తెలుగు రాష్ట్రాల్లో ‘పుష్ప-2’ థియేట్రికల్ రైట్స్ 220 కోట్లకి సేల్ అయ్యాయి. కర్ణాటక రైట్స్ 30 కోట్లకి, తమిళనాడు 50 కోట్లు, కేరళలో 20 కోట్లకు సేల్ అయ్యాయి. తెలుగు రాష్ట్రాలు కాకుండా మిగతా సౌత్ లో 100 కోట్ల బిజినెస్ జరిగింది. పుష్ప-2 హిందీ వెర్షన్ రైట్స్ 200 కోట్లకి సేల్ అయ్యాయి. అంటే ఇంచు మించుగా రెండు తెలుగు రాష్ట్రాల్లో జరిగిన బిజినెస్ లానే..!!