దుల్కర్ నటించిన ఒక హిందీ సినిమా షూటింగ్ తమ ఇంటికి దగ్గర్లో జరుగుతుంటే చూడ్డానికి వెళ్లానని.. ఓవైపు దుల్కర్ చాలా సింపుల్‌గా ఉంటే, అందులో నటించిన ఒక హిందీ స్టార్ హీరోయిన్ మాత్రం అతి చేసిందని.. అతను ఎండలో ఉండి షాట్ కోసం ఎదురు చూస్తుంటే ఫోన్లు మాట్లాడుకుంటూ, ఇంకేదో చేస్తూ టైం వేస్ట్ చేసిందని..ఆమె తీరు నచ్చక చేతిలో ఉన్న బాటిల్‌ను తాను పగలగొట్టడమే కాక.. షూట్ అయ్యాక తన మిత్రులైన ఆ సినిమా నిర్మాతలను తిట్టిపోశానని రానా వెల్లడించాడు. ఐతే ఆ వేడుకలో సినిమా పేరు..ఆ హీరోయిన్ ఎవరన్నది వెల్లడించకపోయినా..
ఈ సినిమా ‘ది జోయా ఫ్యాక్టర్’ అని, రానా మాట్లాడింది సోనమ్ కపూర్ గురించి అని నెటిజన్లు అర్థం చేసుకున్నారు. సోనమ్‌కు ఇంత పొగరా అంటూ చాలామంది నెటిజన్లు ఆమెను ట్రోల్ చేశారు. దుల్కర్ ముందు నువ్వెంత అంటూ ఆమె మీద పోస్టులు పెట్టారు. ఈ ట్రోలింగ్ కొంచెం హద్దులు దాటడంతో రానా స్పందించాడు. తాను సరదాగానే ఆ విషయం చెప్పానని.. దుల్కర్‌తో పాటు సోనమ్ కూడా తన ఫ్రెండే అని..ఇలా ఆమెను ట్రోల్ చేయడం కరెక్ట్ కాదని అన్నాడు. తన వ్యాఖ్యల పట్ల చింతిస్తున్నానని.. సోనమ్‌తో పాటు దుల్కర్‌కు కూడా తాను సారీ చెబుతున్నానని కూడా రానా అన్నాడు..!!