in

vijay d believes trolls are being ‘paid’ to target him!

Keerthy Suresh’s Dorothy

ఈసినిమా గురించి విజయ్ మాట్లాడుతూ.. మనకు ఏ చరిత్ర తెలియకుండా దాచారో, ఏ వీరుల చరిత్ర తెలియకూడదు అనుకున్నారో, ఆ చరిత్రను సరిదిద్దే ప్రయత్నమే ‘రణబాలి’. కరువు అనే పాయింట్ ను మన కల్చర్ నుంచి, ఒక మాసీ హీరోయిక్ బ్యాక్ డ్రాప్ లో రాహుల్ సంకృత్యన్ అద్భుతంగా తెరకెక్కించారు. నా కెరీర్ లోనే ఇది ఒక పెద్ద హైలైట్ గా నిలిచిపోతుంది. అక్టోబర్ 16న మీ కుటుంబంతో కలిసి థియేటర్లలో ఈ సినిమా చూసి, మన పూర్వీకుల డీఎన్ఏ ఏంటో తెలుసుకోండి అని పిలుపునిచ్చారు. రష్మిక ఈ ఈవెంట్ కు రాలేకపోవడానికి కారణం చెప్పి ఆమె తరఫున అందరికీ క్షమాపణలు కూడా తెలిపారు..

ఇదే వేదికపై సోషల్ మీడియాలో తనపై జరుగుతున్న ట్రోలింగ్ , నెగెటివిటీ గురించి విజయ్ మాట్లాడుతూ నిర్మొహమాటంగా తన అభిప్రాయాలను పంచుకున్నారు. నా కలలు, నా శ్రమ వాళ్లకు అనవసరం అనిపిస్తే నేను ఆగాలా? నా ఆత్మవిశ్వాసం వాళ్లకు బలుపు అనిపిస్తే నేను తగ్గాలా? నేను మారను..వాళ్లు మారాలి అంటూ తేల్చిచెప్పారు. సోషల్ మీడియాలో వచ్చే ట్రోలింగ్ అంతా ఆర్గానిక్ హేట్ కాదని, కొందరు వ్యక్తులు గ్రూప్ లుగా ఏర్పడి, డబ్బులు ఖర్చు పెట్టి ఇలాంటి నెగెటివిటీని క్రియేట్ చేస్తున్నారని మండిపడ్డారు. ‘రణబాలి’ సినిమాను కూడా కావాలనే టార్గెట్ చేసి కొన్ని రీల్స్ ట్రెండ్ చేస్తున్నారని, సిస్టమే ఇలా తయారైందని ఆవేదన వ్యక్తం చేశారు.!!

just for like bahuhali Rajamouli created a fictional language for varanasi!

Comrade Kalyan!