ఖుషి’ పాటలు సహా పోస్టర్స్ ఆసక్తిగా ఉండేసరికి ఏదో మంచి సినిమా తీసుకొస్తున్నారు అని చాలా మంది అందుకున్నారు. ఐతే ట్రైలర్ చూసాక మాత్రం సినిమాపై ఉన్న అంచనాలు కూడా చాలా మందికి తగ్గిపోయాయి. కాగా ఇదిలా ఉంటె ప్రమోషన్స్ మాత్రం ఓ రేంజ్ లో ఇప్పుడు మేకర్స్ చేయిస్తున్నారు. అందులో భాగంగా గ్రాండ్ కాన్సెర్ట్ ని నిన్న ప్లాన్ చేయగా ఇందులో హీరో విజయ్ దేవరకొండ హీరోయిన్ సమంతల అతి చూసి నెటిజన్స్ ట్రోల్స్ చేస్తున్నారు. ఎంత అవుట్ డోర్ మ్యూజికల్ కాన్సెర్ట్ అయినా కూడా ఇలాంటి వేషధారణలో వస్తారా అని ఓ రేంజ్ లో ట్రోల్స్ పడుతున్నాయి.
ఇక విజయ్ దేవరకొండ అయితే ఏకంగా ఓ కట్ బనియన్ వేస్కొని ఏదో డాన్స్ షో కి వచ్చినట్టుగా వచ్చేసాడు. దీనితో విజయ్ మీద మరింత ట్రోల్స్ పడుతున్నాయి. ఇక సమంత విషయానికి వస్తే ఓ పక్క ట్రీట్మెంట్ తీసుకుంటున్నాను అని చెప్తూ ఇంకోపక్క ఈ రకం ప్రమోషన్స్ లో కనిపిస్తూ ఉండడం చాలా మందికి అసలు సమంత నిజం చెప్తుందా అబద్దం చెప్తుందా అనే అర్ధం కాని పరిస్థితి. దీనితో వీరి అతి చూసి సోషల్ మీడియా ప్రజానీకం అబ్బూ వీళ్ళకి ఇంకా తగ్గలేదు అనుకుంటున్నారు..!!