7. LACK OF PROMOTIONS!
ఏ సినిమాకి ఆయినా ప్రమోషన్స్ ఉండాలి.. సినిమా రిలీజ్ అయ్యే ముందే రిలీజ్ అయిన తరువాత జనాల్లోకి వెళ్ళడం చాలా ఇంపార్టెంట్..త్రివిక్రమ్ గారు దీనిని అంతగా పట్టించుకోలేదు అనే చెప్పాలి.
6. LACK OF EMOTIONAL CONNECTION!
ఏ సినిమాలో అయినా ఎమోషనల్ కనెక్షన్ చాలా ఇంపార్టెంట్..ఆడియెన్స్ ఎమోషనల్ గా కనెక్ట్ అవ్వకపోతే సినిమా ఆడదు..ఖలేజా సినిమాలో జరిగింది అదే.సినిమాలో ఒక సీరియస్ ఇష్యూ ఉన్నప్పుడు దానిని అంతే సీరియస్ గా ప్రెసెంట్ చెయ్యాలి.. కాని సినిమాలో సీరియస్ ఇష్యూ జరుగుతున్నప్పుడు లేకపోతె ఫైట్ జరుగుతున్నా మధ్యలో కామెడీ జరుగుతుంది. ఖలేజ సినిమాలో ఉన్న కామెడీ పైన ఎలాంటి కామెంట్స్ లేవు అదొక ఎవెర్ గ్రీన్ కామెడీ..కానీ ఒక సీరియస్ ఇష్యూ తీసుకున్నప్పుడు మధ్యలో కామెడీ వస్తే కథలో సీరియస్ నెస్ అండ్ ఫ్లో మిస్ అవుతుంది..ఇదే ఖలేజ ఫ్లాప్ అవ్వడానికి మైన్ రీజన్ అని చెప్పచ్చు.
5. IMPROPER PRESENTATION!
ఖలేజా ఒక మంచి ప్రయత్నం..త్రివిక్రమ్ తన సినిమా ద్వారా గొప్ప విషయాన్ని చెప్పాలి అనుకున్నారు…ఈ సినిమా మైన్ థీమ్ దేవుడు అంటే సాయం..ప్రతీ మనిషిలోనూ దేవుడు ఉంటాడు కానీ అవసరం బట్టి బయటకి వస్తుంటాడు,ఎటువంటి ఫలితం ఆశించకుండా ఎదుటి వారికి సాయం చేసే వాడే దేవుడు అని చెప్పాలి అనుకున్నాడు… త్రివిక్రమ్ కు రైటర్ గా ఫుల్ మార్క్స్ పడ్డాయి కానీ దానిని ప్రెసెంట్ చెయ్యడం లో విఫలమయ్యాడు.
4. INCONSISTENT SCREENWRITING!
అంటే సినిమా కథలో ఫ్లో మిస్ అవ్వడం.అన్ డౌటెడ్ గా త్రివిక్రమ్ గారు ఒక మంచి స్క్రీన్ రైటర్ కాని ఒకసారి అతడు,ఖలేజ సినిమాలను పోలిస్తే అతడు సినిమాలో ప్రతీ కారక్టర్ కథ తో ట్రావెల్ అవుతుంది,కానీ ఖలేజ లో కేవలం కామెడీ కోసమే కారక్టర్స్ ను క్రియేట్ చేసినట్టు ఉంటుంది..ఆ కామిక్ కారక్టర్స్ ను చూడడానికి బానే ఉంటాది కానీ స్టోరీ ను ముందుకి తీసుకుని వెళ్లదు.ఎప్పుడూ కారక్టర్స్ కథను ముందుకి నడిపించే ఉండాలి కాని కిల్ చేసేలా ఉండకూడదు.
3. MAHESH BABU IMAGE
ప్రతీ హీరోకి ఒక ఇమేజ్ ఉంటుంది.ఆ ఇమేజ్ నుండి బయటకి వచ్చి సినిమా చేస్తే ఎక్కువ సార్లు విఫలం అవుతుంటారు.ఖలేజా సినిమాలో జరిగింది అదే.మహేష్ బాబు ఇతర సినిమాలు పోకిరి,అతడు,ఒక్కడు తీసుకుంటే ఆ సినిమాల్లో మహేష్ బాబు చాలా సెటిల్డ్ అండ్ డీసెంట్ క కారెక్టర్స చేశారు.అయితే ఆ మూవీస్ చూసిన జనాలకి ఖలేజా లో మహేష్ కారెక్టర్ ను డైజెస్ట్ చేసుకోలేకపోయారు.నిజానికి సీత రామ రాజు పాత్ర మహేష్ బాబు కెరీర్ లోనే వన్ ఆఫ్ ద బెస్ట్ కారెక్టర్స్ అనే చెప్పుకోవాలి.అసలు మహేష్ బాబు కామెడీ ఇంత బాగా చేస్తాడు అని ఎవరు ఊహించి ఉండరు.కానీ సడన్ గా ఇంత మేక్ ఓవర్ రావడంతో జనాలకు ఎలా రిసీవ్ చేసుకోవాలో తెలియలేదు.
2. EXPECTATIONS!
మహేష్ బాబు మూడు సంవత్సరాల గ్యాప్ తీసుకుని చేసిన సినిమా కావడంతో ఈ సినిమా భారీ అంచనాల మధ్య రిలీజ్ అయ్యింది.అంతే కాకుండా ముందుగా రిలీజ్ చేసిన ట్రైలర్స్ వల్ల ఆడియెన్స్ ఖలేజా ఒక పవర్ఫుల్ మూవీ అనుకున్నారు..కానీ సినిమా దానికి బిన్నంగా ఉంటుంది.సినిమా కమర్షియల్ ఫార్మాట్ లోనే ఉన్నా జనాలకి దేవుడు అనే కాన్సెప్ట్ అలవాటు పడడానికి టైమ్ పట్టింది.
1. NON REVEALING OF CONCEPT!
ఖలేజ సినిమా కాన్సెప్ట్ ఒక అద్భుతం అనే చెప్పాలి.అందరిలోనూ దేవుడు ఉంటాడు, కాని పరిస్థితులు బట్టి అవసరానికి బయటకి వస్తాడు అనేది కాన్సెప్ట్.సినిమా రిలీజ్ అవ్వక ముందే త్రివిక్రమ్ కాన్సెప్ట్ ను చెప్పి ఉండాల్సింది.మీకు గుర్తుంటే సినిమాలో హీరో నేనే కనుక దేవుడిని అయితే ఈ పాప బ్రతకాలి అని అంటాడు.నిజానికి ఆ సీన్ కు క్లేప్స్ పడాలి కానీ జనాలు హీరో దేవుడు ఏంట్రా బాబు అని నవ్వుకుని వదిలేశారు.దేవుడు అనే కాన్సెప్ట్ ను ఆడియెన్స్ జీర్ణించుకోలేకపోయారు.ఒకవేళ త్రివిక్రమ్ గారు సినిమా కాన్సెప్ట్ ను ముందుగా చెప్పి ఉంటే మూవీ రిసల్ట్ వేరేలా ఉండేది ఏమో.