in

7 Reasons Why ‘RRR’ is so Special!

07. భారీ స్థాయి నిర్మాణం

మూవీని ప్రముఖ నిర్మాత దానయ్య ఎంతో భారీ బడ్జెట్ తో నిర్మిస్తుండడం విశేషంగా చెప్పుకోవాలి. దాదాపుగా మూడేళ్లకు పైగా కొనసాగిన ఆర్ఆర్ఆర్ యొక్క బడ్జెట్ సినిమా బిగినింగ్ టైం తో పోలిస్తే ఇటీవల మరింతగా పెరిగింది. కాగా అందరికారిక టాలీవుడ్ వర్గాల నుండి అందుతున్న సమాచారం ప్రకారం ఈ సినిమా కోసం ఏకంగా రూ.550 కోట్లకు పైగా ఖర్చు చేసారని, అలానే అంతటి భారీ ఖర్చుకు ధీటుగా సినిమా కూడా అంతే ల్యావిష్ గా ఉండేలా దర్శకుడు రాజమౌళి అద్భుతంగా తీసారని టాక్. ఇక ఈ సినిమా ఇండియా లోనే అత్యధిక ఖర్చుతో తెరకెక్కుతున్న మూవీ కావడంతో అందరిలోనూ దీని పై విపరీతమైన నమ్మకాలు ఉన్నాయి.

06. భారీ విజువల్ ఎఫెక్ట్స్

క ముఖ్యంగా రాజమౌళి తీసిన యమదొంగ, మగధీర, ఈగ అలానే ఇటీవల వచ్చిన భారీ సినిమాలైనా బాహుబలి రెండు భాగాల్లో కూడా గ్రాఫిక్స్, విజువల్ ఎఫెక్ట్స్ వర్క్ కి ఎంతటి ప్రాధాన్యత ఉందొ, అవి ఆడియన్స్ ని ఎంతలా ఆకట్టుకున్నాయి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. ఇక ప్రస్తుతమ్ రాజమౌళి తీస్తున్న ఈ ఆర్ఆర్ఆర్ సినిమాలో కూడా విజువల్ ఎఫెక్ట్స్ కి మరింతగా ప్రాధాన్యత ఉందని, ముఖ్యంగా పలు కీలక సన్నివేశాల్లో వచ్చే గ్రాఫిక్, విజువల్ సీన్స్ ఆడియన్స్ కి గూస్ బంప్స్ తెప్పిస్తాయని..

05. భారీ యాక్షన్ సీన్స్

క ఈ ఆర్ఆర్ఆర్ సినిమా గురించి మాట్లాడుకోవాలంటే ముఖ్యంగా చెప్పుకోవాల్సింది భారీ యాక్షన్ సన్నివేశాలని ఇన్నర్ వర్గాల టాక్. ముఖ్యంగా సినిమాలో ఫస్ట్ హాఫ్ లో వచ్చే సీన్స్, ఇంటర్వెల్ ఎపిసోడ్, సెకండ్ హాఫ్ లో వచ్చే యాక్షన్ ఎపిసోడ్స్ తో పాటు ప్రీ క్లైమాక్స్, క్లైమాక్స్ సీన్స్ వంటిది రేపు విడుదల తరువాత మెగా నందమూరి ఫ్యాన్స్ తో పాటు ఆడియన్స్ కి కూడా ఐ ఫీస్ట్ ని అందించడం ఖాయం అట. ఇక ఈ సీన్స్ కోసం దర్శకుడు రాజమౌళి ఎంతో భారీగా కసరత్తు చేయడం జరిగిందని, అలానే సినిమాలో ఎన్టీఆర్ పులితో పోరాడే సీన్, రామ్ చరణ్ పోలీస్ స్టేషన్ సీన్స్ అయితే ఆడియన్స్ ని మరింతగా అలరిస్తాయని చెప్తున్నారు.

04 . హీరోల ఇంట్రడక్షన్ సీన్స్

కపోతే ముఖ్యంగా ఈ ఆర్ఆర్ఆర్ సినిమాలో కొమరం భీం గా చేస్తున్న ఎన్టీఆర్ అలానే అల్లూరి సీతారామరాజుగా నటిస్తున్న రామ్ చరణ్ ఇద్దరి ఇంట్రడక్షన్ సీన్స్ అదిరిపోనున్నట్లు టాక్. ముఖ్యంగా సీన్స్ కోసం దర్శకుడు రాజమౌళి ఎంతో కేర్ తీసుకున్నారని, అటు ఎన్టీఆర్, అలానే ఇటు చరణ్ ఇద్దరూ కూడా తమ సీన్స్ కోసం ఎంతో కష్టపడి నటించారని టాక్. మనకు రేపు సినిమా చూసిన తరువాత తెరపై చరణ్ ఎన్టీఆర్ కాకుండా కేవలం రామరాజు, భీం పాత్రలు మాత్రమే కనిపిస్తాయని ఆ విధంగా వారిద్దరూ తమ తమ పాత్రల్లో పరకాయ ప్రవేశం చేసారని సమాచారం. ఇక వీరిద్దరి ఇంట్రడక్షన్ సీన్స్ కోసం భారీ గా ఖర్చు చేసినట్లు టాక్.

03. మెగాపవర్ స్టార్ రామ్ చరణ్

టాలీవుడ్ మెగాస్టార్ చిరంజీవి తనయుడైన రామ్ చరణ్ చివరిగా వినయ విధేయ రామ్ సినిమా ద్వారా ప్రేక్షకుల ముందుకు వచ్చారు. అనంతరం తన స్నేహితుడు ఎన్టీఆర్ తో కలిసి ప్రస్తుతం ఆయా చేసిన సినిమా ఆర్ఆర్ఆర్. కాగా ఈ సినిమాలో చరణ్, మన్యం వీరుడు అల్లూరి సీతారామరాజు పాత్ర చేస్తుండగా ఆయనకు జోడీగా సీత పాత్రలో ప్రముఖ బాలీవుడ్ నాయిక అలియా భట్ నటిస్తున్నట్లు తెలుస్తోంది. ఇక అల్లూరి పాత్రకు తగ్గట్లుగా ఆయన రూపు, ఆహార్యాన్ని ఉన్నది ఉన్నట్లుగా ప్రదర్శించడానికి పాత్ర కోసం చరణ్ కూడా ఎంతో కష్టపడ్డారు. ఇక విడుదల తరువాత ఈ సినిమాలోని రామరాజు పాత్ర ద్వారా నటుడిగా చరణ్ మరింత అద్బుతమైన పేరు దక్కించుకోవడం ఖాయం అంటోంది యూనిట్.

02 . యంగ్ టైగర్ ఎన్టీఆర్ కొమరం భీం

రవింద సామెత మూవీ తరువాత ఎన్టీఆర్ నటిస్తున్న సినిమానే ఆర్ఆర్ఆర్ . ఇక తన మిత్రుడు రామ్ చరణ్ తో కలిసి ఎన్టీఆర్ ఈ సినిమా తొలిసారిగా చేస్తున్నారు. ఇక ఈ సినిమాలో ఎన్టీఆర్, గోండు బెబ్బులి కొమరం భీం గా యాక్ట్ చేస్తున్నారు అనేది తెలిసిందే. ఈ పాత్ర కోసం ఇప్పటికే భారీ గా బాడీ పెంచడంతో పాటు తెలంగాణ స్లాంగ్ ని కూడా నేర్చుకున్న ఎన్టీఆర్, డైలాగ్స్ ని సినిమాలో ఎంతో అద్భుతంగా పలకడంతో పాటు ముఖ్యంగా కొమరం భీం శైలి, ఆహార్యాన్ని ఎంతో చక్కగా ప్రదర్శించారని సమాచారం. ఇక కొమరం భీం పాత్ర సినిమాలో ఎంతో కీలకం అని, ఈ పాత్రని కథకుడు విజయేంద్ర ప్రసాద్ ఎంతో అద్భుతంగా తీర్చిదిద్దగా రాజమౌళి మరింత అద్భుతంగా తీసారట. అలానే ఎన్టీఆర్ కి ఈ సినిమాలో జోడిగా హాలీవుడ్ నటి ఒలీవియా మోరిస్ నటిస్తున్నారు. ఆమె ఈ సినిమాలో జెన్నిఫర్ అనే పాత్ర చేస్తున్నారు. మొత్తంగా ఈ కొమరం భీం పాత్ర ఆడియన్స్ నిే ఎంతో ఆకట్టుకోవడంతో పాటు హీరోగా ఎన్టీఆర్ కి మరింత గొప్ప పేరు తెచ్చిపెడుతుందని అంటున్నారు.

01. ఎస్ ఎస్ రాజమౌళి

తొలిసారిగా ఎన్టీఆర్ హీరోగా తెరకెక్కిన స్టూడెంట్ నెంబర్ 1 సినిమా ద్వారా దర్శకుడిగా మెగాఫోన్ పట్టి ఆ సినిమాతో సూపర్ హిట్ కొట్టిన రాజమౌళి, అక్కడి నుండి ఇప్పటివరకు కెరీర్ పరంగా ఒక్క అపజయం కూడా ఎరుగని దిగ్గజ దర్శకుడిగా గొప్ప పేరు ప్రఖ్యాతలు గడిస్తూ కొనసాగుతున్నారు. ఇటీవల బాహుబలి మూవీస్ తో భారత దేశం గర్వించదగ్గర దర్శకుడిగా పేరు సొంతం చేసుకున్న రాజమౌళి, ప్రస్తుతం తీస్తున్న ఆర్ఆర్ఆర్ సినిమాని మరింత అద్భుతంగా అన్ని వర్గాల ఆడియన్స్ ని అలరించే విధంగా మరింత గ్రాండ్ గా తీస్తినట్లు టాక్. ఇక ఈ సినిమా కోసం ప్రాణం పెట్టిన రాజమౌళి, తప్పకుంరా రేపు సినిమా విడుదల తరువాత అందరి నుండి మరొక్కసారి భారీ స్థాయిలో ప్రశంసలు అందుకోవడం ఖాయం అంటున్నారు.

hot sensation Dimple Hayathi to act opposite macho star !

bebamma Kriti Shetty Celebrates 1 Year Of Her Debut Film ‘Uppena’!