in

Yash reacts to Rashmika Mandanna’s ‘Mr Showoff’ comment

2017లో ఓ ఇంటర్వ్యూలో రష్మిక.. యశ్‌ను ఉద్దేశించి ‘మిస్టర్ షో ఆఫ్’ (Mr. Show Off) అంటూ వ్యాఖ్యానించిన సంగతి అప్పట్లో పెద్ద దుమారమే రేపింది. తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న యశ్ ఈ వివాదంపై తనదైన శైలిలో పరిణతితో కూడిన సమాధానం ఇచ్చారు. ఆమె ఏ ఉద్దేశంతో అలా అన్నారో తనకు తెలియదని, అప్పట్లో తను ఇండస్ట్రీకి కొత్త కావడం వల్ల అలా జరిగి ఉండొచ్చని పేర్కొన్నారు. టీవీ షోలలో యాంకర్లు ఇచ్చే కొన్ని ఆప్షన్లలో తనకు ఏది సరిపోతుందనిపిస్తే దానిని ఎంచుకుని ఉంటారని, తాను మాత్రం ఆ విషయాన్ని పెద్దగా మనసులో పెట్టుకోలేదని యశ్ స్పష్టం చేశారు..

ఎవరి అభిప్రాయాలు వారివని, కానీ ఎవరో ఒకరు చెప్పే అభిప్రాయాన్ని బట్టి తన వ్యక్తిత్వం లేదా క్యారెక్టర్ మారదని తేల్చిచెప్పారు. ఇతరుల దృష్టికోణం తనను నిర్వచించలేదని ఆయన స్పష్టం చేశారు. ఈ సందర్భంగా తన అభిమానులను ఉద్దేశించి యశ్ ఒక ముఖ్యమైన విజ్ఞప్తి చేశారు. సహ నటీనటులను, తోటి కళాకారులను గౌరవించని వారు ఎప్పటికీ తన అభిమానులు కారంటూ ఫ్యాన్స్‌కు హితవు పలికారు. కాగా, రష్మిక ఆ వ్యాఖ్యలు చేసిన సమయంలో యశ్ అభిమానులు తీవ్ర స్థాయిలో ట్రోల్ చేయడంతో ఆమె బహిరంగంగా క్షమాపణలు చెప్పిన విషయం తెలిసిందే..!!

Prashanth Neel ditches his signature dark visuals for ‘Dragon’!

Ram Pothineni onboard for Rajinikanth’s Dharman for a key role!