in

Prashanth Neel ditches his signature dark visuals for ‘Dragon’!

ప్రశాంత్ నీల్, ఎన్టీఆర్ కలయికలో రాబోతున్న సినిమా డ్రాగన్. ఈ సినిమా అప్ డేట్ కోసం ఎన్టీఆర్ ఫ్యాన్స్ ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఐతే, ‘డ్రాగన్’ బడ్జెట్ అనుకున్నదానికంటే పెరిగిపోయిందంటూ కొన్ని పుకార్లు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి. కానీ, ‘డ్రాగన్’ ఓవర్ బడ్జెట్ అయిందనే వార్తలు కేవలం రూమర్స్‌ మాత్రమే అని, ఈ సినిమా విషయంలో బడ్జెట్ అనుకున్నట్టుగానే అవుతుందని ఇన్ సైడ్ టాక్. ఐతే, దర్శకుడు అనుకున్న భారీ స్థాయిలోనే సినిమాను తెరకెక్కించడానికి మేకర్స్ సిద్ధంగా ఉన్నారట.

కచ్చితంగా పాన్ ఇండియా స్థాయిలోనే సినిమా ఉంటుందట. అన్నట్టు ప్రశాంత్ నీల్ సినిమా అనగానే ఫుల్ బ్లాక్ అండ్ గ్రే షేడ్ ఫ్రేమ్ మాత్రమే ఎక్కువ కనిపిస్తోంది. కానీ, ఎన్టీఆర్ తో తీస్తున్న ఈ సినిమా ఫ్లాష్ బ్యాక్ మొత్తం ఫుల్ కలర్ ఫుల్ గా ఉంటుందట. పైగా ఈ ఫ్లాష్ బ్యాక్ లో బ్లాక్ షేడ్ ఫ్రేమ్ కూడా కనిపించదట. మరి ప్రశాంత్ నీల్ ఫ్లాష్ బ్యాక్ కోసం అంత కలర్ ఫుల్ గా ఏం తీస్తున్నాడో చూడాలి. మైత్రీ మూవీ మేకర్స్ మరియు ఎన్టీఆర్ ఆర్ట్స్ కలిసి ఈ సినిమాని నిర్మిస్తున్నాయి. ఈ సినిమాకు రవి బస్రూర్ సంగీతం అందిస్తున్నారు. మొత్తానికి ఈ సినిమా పై భారీ అంచనాలు ఉన్నాయి..!!

Nidhhi Agerwal’s next film to be a mythological thriller!

Yash reacts to Rashmika Mandanna's 'Mr Showoff' comment

Yash reacts to Rashmika Mandanna’s ‘Mr Showoff’ comment