in

wink girl Priya Prakash Varrier’s career in danger zone!

ప్రియ ప్రకాశ్‌ వారియర్‌కి ఫస్ట్‌ మూవీ కూడా రిలీజ్‌కాకముందే సూపర్‌ క్రేజ్ వచ్చింది. వింక్‌ సెన్సేషన్‌గా ఇండియావైడ్‌ పాపులర్ అయ్యింది. ఇక ఈ క్రేజ్‌తో ప్రియ ఫుల్‌ బిజీ అవుతుందని, బాలీవుడ్‌లో కూడా హంగామా చేస్తుందనే టాక్ వచ్చింది. కానీ ప్రియ ప్రకాశ్‌కి ఇప్పటివరకు ఒక్క హిట్‌ కూడా లేదు. ప్రియ ప్రకాశ్‌ వారియర్‌కి ‘ఒరు ఆదార్ లవ్’ తర్వాత తెలుగు, హిందీల్లో కూడా ఆఫర్స్ వచ్చాయి. బాలీవుడ్‌లో ‘శ్రీదేవి బంగ్లా’ అనే సినిమా చేసింది. అయితే ఈ మూవీ ఇంకా పోస్ట్‌ ప్రొడక్షన్‌ స్టేజ్‌లోనే ఉంది.

రిలీజ్ డేట్‌ గురించి ఇప్పటికీ క్లారిటీ లేదు. ఇక తెలుగులో నితిన్‌తో చేసిన ‘చెక్’ సినిమా ఆడియన్స్‌ని పెద్దగా ఆకట్టుకోలేకపోయింది. ప్రియ ప్రకాశ్‌ వారియర్‌ చేతిలో ఇప్పుడు ఒకే ఒక్క సినిమా ఉంది. తేజ సజ్జాతో చేస్తోన్న ‘ఇష్క్’ సినిమా తప్ప మరో ప్రాజెక్ట్ లేదు. ఈ మూవీ తర్వాత ప్రియాకి పెద్దగా అవకాశాలు కూడా రాకపోవచ్చు అంటున్నారు. ఎందుకంటే సొంత రాష్ట్రం మళయాళంలో కూడా ప్రియని కన్సిడర్ చెయ్యట్లేదు. దీంతో ప్రియ ప్రకాశ్ కెరీర్‌ డేంజర్‌ జోన్‌లో పడుతుందనే ప్రచారం జరుగుతోంది..

rang de!

aranya!