in

balayya’s heroine Sonal Chauhan to play cameo in F3!

టాలీవుడ్ లో వెంక‌టేశ్‌-వ‌రుణ్ తేజ్ కాంబోలో వ‌స్తున్నమూవీ ఎఫ్‌3. త‌మ‌న్నా, మెహ‌రీన్ కౌర్ హీరోయిన్లుగా న‌టిస్తున్నారు. అనిల్‌ రావిపూడి ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తున్నాడు. ఈ ప్రాజెక్టుకు సంబంధించిన ఆస‌క్తిక‌ర‌ అప్ డేట్ ఫిలింన‌గ‌ర్ సర్కిల్ లో చ‌క్క‌ర్లు కొడుతోంది. బాలీవుడ్ భామ సోనాల్ చౌహాన్ ఎఫ్ 3లో కీ రోల్ చేస్తుంద‌న్న వార్త టాక్ ఆఫ్ ది టౌన్ గా మారింది. అనిల్ రావిపూడి ఎఫ్ 3 కోసం సోనాల్ ను సంప్ర‌దించ‌గా..

ఈ భామ గ్రీన్ సిగ్న‌ల్ ఇచ్చేసిన‌ట్టు టాక్‌. పండ‌గ‌చేస్కో, రూల‌ర్ చిత్రాల్లో న‌టించింది సోనాల్ చౌహాన్‌. ఫ‌న్‌..ఫ్ర‌స్టేష‌న్‌..ఫార్చూన్ ట్యాగ్‌లైన్‌తో డ‌బ్బు చుట్టూ ఎఫ్ 3 స్టోరీ ఉండ‌నుంద‌ని టాక్‌. వెంక‌టేశ్ పాత్ర ఇందులో రేచీక‌టి ఉన్న వ్య‌క్తిగా ఎంట‌ర్‌టైనింగ్‌గా సాగ‌నుంద‌ట‌. శ్రీ వెంక‌టేశ్వ‌ర క్రియేష‌న్స్ బ్యాన‌ర్ పై దిల్‌రాజు ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఎఫ్‌2 సీక్వెల్‌గా వ‌స్తున్న ఈ చిత్రంలో తెర‌కెక్కుతోంది. ఆగ‌స్టు 27న విడుద‌ల కానుంది.

Kiara Advani is the first choice for Ram Charan’s next with Shankar!

rang de!