in

WHAT A PATHETIC END!

క్క సారి ముఖానికి రంగు వేసుకుంటే, అది జీవితాంతం వదలదు అనేది నానుడి. దానికి తగినట్లుగానే నటుడు అనే వారు ఎవరయినా మీ కోరిక ఏమిటి అంటే చివరి వరకు నటిస్తూనే ఉండాలి అంటారు. వెండి తెర మీద తిరుగులేని విలన్ గ, క్యారక్టర్ నటుడిగా వెలుగొందిన రాజనాల గారు, హీరోల తో సమానం గ పారితోషికం తీసుకున్న ఘనమయిన వెండి తెర విలన్, చివరి దశలో వేషాలు లేక, చేతిలో డబ్బులు లేక ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొన్నారు, ఒక రోజు డైరెక్టర్ వంశీ గారి ఆఫీస్ కు ఒక పెద్దాయన వచ్చారు, యధాలాపం గ ఆయనను చూసిన వంశీ గారు, రాజనాల గారు రండి, అంటూ సాదరంగా ఆహ్వానించారు, ఇంటి దగ్గర నుంచి నడిచి వచ్చే సరికి అలసటగా ఉంది కొంచెం మంచి నీళ్లు ఇవ్వమనగానే, వంశీ గారు ఇచ్చిన గ్లాసుడు నీళ్లు గడ, గడా తాగి, నీ సినిమాలు చూసాను అబ్బాయ్ బాగున్నాయి, నాకేదయినా వేషం ఉంటె ఇవ్వు అని ప్రాధేయ పడటం తో, వంశీ గారి మనసు కలచి వేసింది. ప్రస్తుతం నేనేమి సినిమా చెయటం లేదు,గురువు గారు, ఏదయినా ఉంటె కబురు చేస్తాను అని, ఆయనను టాక్సీ పిలిచి ఎక్కించి పంపారు. ఆ తరువాత వంశీ గారు ఆయనకు తగిన పాత్ర ఏది ఆయనకు ఇవ్వలేక పోయారు..

కొంత కాలం తరువాత రామోజీ రావు గారు తమతో సినిమాలు చేసిన డైరెక్టర్స్ తో, తమ ఈ టి.వి. ఛానెల్ కోసం సీరియల్స్ చేయించారు, ఆ క్రమం లో వంశీ గారు కూడా “లేడి డిటెక్టివ్ ” అనే సీరియల్ చేసారు, ఆ షూటింగ్ సందర్భం గ ఒక సంఘటన చోటు చేసుకున్నది. ఆ సీరియల్ కధనం ప్రకారం, ఆ రోజు వంశీ గారు స్మశానం లో ఒక కాలుతున్న చితిని షూట్ చేసారు, మండుతున్న చితి మంటలను అలా జూమ్ చేసి సీన్ షూట్ చేసారు, బాగా వచ్చింది. కెమెరా స్విచ్ ఆఫ్ చేసి అక్కడ ఉన్న కాటి కాపరిని అడిగారట, ఎవరు పోయింది అని, సినిమా యాక్టర్ రాజనాల బాబయ్య, అంటూ వచ్చిన సమాధానము విన్న వంశీ, అచేతనం గ అలాగే నిలబడి పోయారు , ఒక్క సారి, దీనంగా నాకేదయినా వేషం ఉంటె ఇవ్వబ్బాయ్ అంటున్న, రాజనాల గారు కళ్ళ ముందు మెదిలారు, గురువు గారు మీరు బ్రతికుండగా మీకు వేషం ఇవ్వలేక పోయాను, మీ అంతిమ ప్రయాణం చిత్రీకరించాను, నన్ను క్క్షమించండి గురువు గారు అని మౌనం గ అంజలి ఘటించిన వంశీ గారి కళ్ళు చెమర్చాయి,”నిటాలెక్షణుండు గజ్జ కదిలించి ఆడు రంగస్థలం” వేదికగా, ఓ మహా నటుడు మౌనంగా నిష్క్రమించాడు !!!

happening girl sreeleela reveals her beauty secrets!

happy birthday sumanth!