in

telugu cinema rejected, dubbing accepted!

కొన్ని సినిమాలు ఎలాంటి అంచనాలు లేకుండా చిన్న సినిమాలుగా వచ్చి బాక్సాఫీస్ వద్ద రికార్డుల సృష్టిస్తాయి. ప్రొడ్యూసర్లకి ఊహించనన్ని లాభాలను తెచ్చిపెడుతాయి. ఇటీవల వచ్చిన కాంతార మూవీ అలాంటిదే. కాగా కాంతార లాంటి మూవీ తెలుగులో వచ్చిందా అంటే దానికి  సమాధానమే ‘ఆకాశవాణి’  అనే సినిమా. దర్శక ధీరుడు రాజమౌళి శిష్యుడు ‘ఆకాశవాణి’ అనే పేరుతో కాంతార తరహా సినిమాని రూపొందించాడు. మరి ఆకాశవాణి కథ ఏమిటో చూద్దాం. బయట వేరే ప్రపంచం ఉందని కూడా తెలియకుండా నాగరిక ప్రపంచానికి సుదూరంగా ఓ అడవిలో కొందరు గూడెం వాసులు బతుకుతూ ఉంటారు. వాళ్ళు ఉన్నట్టు బయట ప్రపంచానికి కూడా తెలియదు. గూడెం వారంతా దొర కనుసన్నలలో జీవిస్తుంటారు.వారికి దొర మాట అంటే దైవాజ్ఞ. ఆ దొర కూడా తానే దేవుడిని అని నమ్మిస్తూ, భయపెడుతూ అక్కడి వారిని అడవి దాటి బయటికి వెళ్ళకుండా చూస్తుంటాడు..

ఇక ఆ ఊరిలోకి వేరే ఊరి వారు వస్తే వచ్చిన వాళ్లను వచ్చినట్టే దొర చంపేస్తూంటాడు.ఈ క్రమంలో ఆ గూడెంలోని ఒక పిల్లాడికి రేడియో దొరుకుతుంది.రేడియో అంటే ఏమిటో,ఎలా ఉంటుందో వాళ్ళకి తెలియదు. అయితే ఆ రేడియో వల్ల గూడెంలో అల్లకల్లోలం జరిగి, అదే దేవుడిగా మారుతుంది.దీంతో తాను కాకుండా ఇంకో దేవుడు ఉండటం నచ్చని దొర అప్పుడు ఏం చేసాడు. మూఢనమ్మకాలతో బతుకుతున్న అక్కడి ప్రజలకు ఆ రేడియో ద్వారా ఓ స్కూల్ మాస్టర్ వారికి ఎలా విముక్తి కలిగించాడు అనేది మిగిలిన కథ. అయితే ఈ మూవీలో నటించిన వారిలో చాలా మంది కొత్తవారు కావటం, అంతేకాకుండా సబ్ స్క్రైబర్లు తక్కువ సంఖ్యలో ఉన్న సోనీ లివ్ లాంటి ఓటీటీలో విడుదల అవడం కూడా ఆకాశవాణికి మైనస్ అయ్యిందనే చెప్పాలి..!!

RCB Gifts Team Jersey To Prabhas And Salaar Team!

meenakshi chowdhary turns item girl for devara?