in

VISUAL TREAT FOR MOVIE FANS !

ఎన్ టి ఆర్ ప్రస్తుతానికి రాజమౌళి రూపొందిస్తున్న ఇండియాస్ మోస్ట్ అవైటెడ్ ఫిల్మ్ ఆర్ ఆర్ ఆర్ లో కొమరం భీమ్ గ నటిస్తున్న విషయం తెలిసిందే..అయితే ఇప్పటికే ఈ సినిమా కోసం రాజమౌళి ఎన్ టి ఆర్ మీద కొన్ని ఆసక్తికర సన్నివేశాలు, ఏక్షన్ సీన్లు చిత్రీకరించారు..

 

ఎన్ని ఏక్షన్ సీన్ లు తీసిన ఏమన్నా స్పెషల్ ఫైట్ ఉండాలి అనుకున్నాడేమో… ఈ సినిమాలో ఎన్టీఆర్ ఏకంగా ఒక పులితో తలపడే సీక్వెన్స్ ను డిజైన్ చేశాడట. మరి మా ఎన్ టి ఆర్ పులితో తో ఫైట్ చేస్తుంటే ఆపడానికి ప్రయత్నించకుండా న్యూస్ లు వేస్తున్నారా…ముందు ఈ ఆర్టికల్ రాసినొడిని ఏసెయ్యలి అనుకుంటున్నారా !!!

అలాంటి అద్భుతమైన నిర్ణయాలు తీసుకోవాల్సిన పని లేదండి… ఎందుకంటే
ఎన్టీఆర్ నిజానికి నిజమైన పులితో ఫైట్ చేయడు గ్రాఫిక్స్ ప్రపంచంలో ఆరితేరిపోయిన రాజమౌళికి నిజమైన పులికి రీక్రియేట్ చేయడం పెద్ద సమస్య కాదు. కానీ.. తెరపై ఆ ఫైట్ ను చూస్తున్నవాళ్లకి మాత్రం మైండ్ పోతుందట.
ఆ రేంజ్ లో సదరు యాక్షన్ బ్లాక్ ఉండబోతోందని తెలుస్తోంది

F CUBE ‘NANI’

HISTORY OF BIG BOSS FAME ALI REZA !