in

VENKY MAMA

Synopsis:

Venky Mama is a 2019 Indian Telugu-language action comedy film produced by D. Suresh Babu under Suresh Productions banner and directed by K. S. Ravindra.

CAST: Venkatesh, Naga Chaithanya, Rashi Khanna, Payal Rajput.

TELUGU SWAG RATING: 2.5 out of 5 stars

Top Reviewers:

TELUGU 360 (Rating: 2.5/5):

వెంక‌టేష్ కామెడీ టైమింగ్ గురించి, ఎన‌ర్జీ గురించీ ప్ర‌త్యేకంగా చెప్పాల్సిన ప‌నిలేదు. ఓ ర‌కంగా చైతూ కంటే.. హుషారుగా న‌టించేశాడు. ఈ సినిమాని వీలైనంత వ‌ర‌కూ మోసుకుంటూ వెళ్లాడు. కామెడీ పార్ట్‌, ఎమోష‌న్ సీన్లు.. ఇలా ఎక్క‌డా త‌గ్గ‌లేదు. పాట‌ల్లోనూ హుషారైన స్టెప్పులేశాడు. చైతూ కూడా ఉన్నంత వ‌ర‌కూ ఓకే. కానీ ఆ పాత్ర‌ని ప‌రిపూర్ణంగా డిజైన్ చేయ‌లేద‌నిపిస్తుంది. ఇది మ‌ల్టీస్టార‌ర్ సినిమానే అయినా వెంకీ ముద్ర అడుగ‌డుగునా క‌నిపిస్తుంది. వెంకీ ప‌క్క‌న ఉండి రాణించ‌డం ఎంత క‌ష్ట‌మో చైతూని చూస్తే అర్థం అవుతుంది. రాశీ, పాయ‌ల్‌ల‌వి ఫ‌క్తు క‌మ‌ర్షియ‌ల్ హీరోయిన్ టైపు పాత్ర‌లు. రావు ర‌మేష్ పాత్ర‌కి ఎండింగ్ లేదు. ప్ర‌కాష్‌రాజ్‌, నాజ‌ర్‌… వీళ్ల‌వ‌న్నీ చిన్న చిన్న పాత్ర‌లే. హైప‌ర్ ఆది త‌న‌దైన పులిహార సెటైర్లు వేశాడు

Mirchi9 (Rating: 2.5/5):

ఇది నిజంగానే ‘వెంకీ’మామ సినిమానే. అయితే మామఅల్లుళ్లు తొలిసారి స్క్రీన్ షేర్ చేసుకోవడంతో తెరపై ఓ నిండుదనం కనిపిస్తుంది. మొత్తానికి వెంకీ మామ సక్సెస్ అయ్యాడు. ఇక కమర్షియల్‌గా వెంకీమామ స్టామినా ఏంటన్నది చూడాలి

123TELUGU (Rating: 3/5):

విక్టరీ వెంకటేష్, నాగ చైతన్య కలయికలో వచ్చిన ఈ ఎమోషనల్ క్రేజీ మల్టీస్టారర్.. సరదాగా మంచి ఫన్ తో సాగుతూ కొన్ని ఎమోషనల్ సన్నివేశాలతో పాటు కొన్ని యాక్షన్ ఎలిమెంట్స్ తో కూడా బాగానే ఆకట్టుకుటుంది. అయితే దర్శకుడు సినిమాను ఎంటర్ టైన్ గా నడిపినప్పటికీ.. కొన్ని సన్నివేశాల్లో లాజిక్ మిస్ అవ్వడం, మొయిన్ గా సెకండ్ హాఫ్ లో క్లైమాక్స్ సీక్వెన్స్ స్ లో వచ్చే సీన్స్ సినిమా స్థాయికి తగ్గట్లు లేకపోవడం వంటి అంశాలు సినిమాలో మైనస్ పాయింట్స్ గా నిలుస్తాయి. ఐతే వెంకటేష్ తన కామెడీ టైమింగ్ తో బాగా అలరించారు. ఈ సినిమా చూసి ప్రేక్షకులు మనస్ఫూర్తిగా నవ్వుకుంటారనడంలో ఎలాంటి సందేహం లేదు. మరి ఈ చిత్రాన్ని తెలుగు ప్రేక్షకులు ఏ స్థాయిలో ఆదరిస్తారో చూడాలి.

Times Of India (Rating: 3.5/5):

సాంకేతిక వర్గం విషయానికి వస్తే సినిమా రిలీజ్‌కు ముందే పాటలతో హిట్ కొట్టిన తమన్‌, నేపథ్య సంగీతంతో మరింత ఆకట్టుకున్నాడు. ఫస్ట్ హాఫ్‌ లవ్‌, కామెడీ సీన్స్‌తో పాటు సెకండ్‌ హాఫ్‌లో వచ్చే యాక్షన్‌, ఎమోషనల్‌ సీన్స్‌లో బ్యాక్‌గ్రౌండ్‌ స్కోర్‌ ఆకట్టుకుంటుంది. సినిమాకు మరో మేజర్‌ ప్లస్‌ పాయింట్‌ సినిమాటోగ్రఫి ప్రసాద్‌ మూరెళ్ల. పల్లెటూరి సన్నివేశాలతో పాటు ఆర్మీ ఎటాక్‌, కాశ్మీర్‌లో చిత్రీకరించిన క్లైమాక్స్‌ సీన్స్‌లో కెమెరామెన్‌ పడిన కష్టం తెరమీద కనిపిస్తుంది. ఎడిటింగ్‌ విషయంలో ఇంకాస్త దృష్టి పెట్టాల్సింది. చాలా సన్నివేశాలు సాగదీసిన ఫీలింగ్‌ కలిగిస్తాయి. ఫ్యామిలీ మల్టీ స్టారర్‌ సినిమా కావటంతో సురేష్‌ బాబు ఖర్చుకు ఏ మాత్రం వెనకాడకుండా సినిమాను రిచ్‌గా తెరకెక్కించాడు

SNEHAMERA JEEVITHAMANNA GIRI BABU!

rangastalam movie mistakes